Telangana: అప్పుడే మున్సిపాలిటీలపై దృష్టిసారించిన కాంగ్రెస్‌.. అక్కడ కాకరేపుతోన్న అవిశ్వాస తీర్మానం

ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 14 స్థానాలకుగాను, 12చోట్ల గెలుపొంది జోరుమీదుంది కాంగ్రెస్ పార్టీ. దీంతో ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు నేతలు. ఎన్నికల మందు పార్టీలో చేరిన కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల సంఖ్యను...

Telangana: అప్పుడే మున్సిపాలిటీలపై దృష్టిసారించిన కాంగ్రెస్‌.. అక్కడ కాకరేపుతోన్న అవిశ్వాస తీర్మానం
TS Municipal Elections
Follow us
Boorugu Shiva Kumar

| Edited By: Narender Vaitla

Updated on: Jan 09, 2024 | 7:37 PM

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలపై ఫోకస్ పెట్టింది. పాలకవర్గాలకు ఏడాది మాత్రమే గడువున్నప్పటికీ మున్సిపాలిటీల్లో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. తాజాగా పాలమూరు మున్సిపాలిటీలో అవిశ్వాసం హీట్ పెంచుతోంది. రాష్ట్రంలోని అతిపెద్ద మున్సిపాలిటీని హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది.

ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 14 స్థానాలకుగాను, 12చోట్ల గెలుపొంది జోరుమీదుంది కాంగ్రెస్ పార్టీ. దీంతో ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు నేతలు. ఎన్నికల మందు పార్టీలో చేరిన కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల సంఖ్యను బేరీజూ వేసుకోవడంతో పాటు తాజాగా మద్ధతు ఇచ్చే వారితో కలుపుకోని అవిశ్వాస తీర్మానానికి సిద్దమైంది.

మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్లు కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లతో చేతులు కలిపారు. ప్రస్తుత మున్సిపల్ ఛైర్మన్ నర్సింహులుపై జిల్లా కలెక్టర్ రవినాయక్ కు 32మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని అందజేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 19మంది, కాంగ్రెస్ 6, ఎంఐఎం 4, బీజేపీ 3 కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేశారు. నాలుగేళ్లుగా తమ వార్డులకు నిధులు ఇవ్వకపోవడంతో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని తీర్మానంలో పేర్కొన్నారు.

కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్ కౌన్సిలర్లు..

మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో 36మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి చెందినవారు ఉన్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో దాదాపు 20మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ వైపు వచ్చినట్లు తెలుస్తోంది. మరికొంత మంది కౌన్సిలర్లు సైతం కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గత కొంత కాలంగా ఊగిసాలాడుతున్న మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానానికి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన కౌన్సిలర్ అనంద్ గౌడ్ తో పాటు, కాంగ్రెస్ ముఖ్యనేతలు ఎన్ పీ వెంకటేశ్, సురేందర్ రెడ్డి ప్రణాళికలు రచించారు. ఎన్నికల ముందు పార్టీ మారిన కౌన్సిలర్లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశామని మున్సిపల్ ఛైర్మన్ నర్సింహులు ప్రకటించిన 24గంటల్లోనే ఆయనపై మిగిలిన కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని కలెక్టర్ కు అందించడం గమనార్హం.

అవిశ్వాస తీర్మానంపై ఉత్కంఠ..

అవిశ్వాస తీర్మానం తదుపరి ప్రక్రియపై మహబూబ్ నగర్ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. కౌన్సిలర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం కాపీని కలెక్టర్ రవి నాయక్ త్వరలోనే మున్సిపల్ కమిషనర్ కు పంపనున్నారు. తీర్మానం కాపీలో ఉన్న సంతకాలను వెరిఫికేషన్ చేయడంతో పాటు కౌన్సిలర్ల అభిప్రాయాలను మున్సిపల్ కమిషనర్ కలెక్టర్ కు నివేదించనున్నారు. తదుపరి కౌన్సిల్ ప్రత్యేక సమావేశానికి ఏర్పాటు చేసి అవిశ్వాస తీర్మానం అంశాన్ని తేల్చే అవకాశం ఉంటుంది. హఠాత్తుగా జరిగిన అవిశ్వాస తీర్మానం పరిణామంతో బీఆర్ఎస్ కంగుతింది. మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానంపై చైర్మన్ నర్సింహులు హైకోర్ట్ ను ఆశ్రయించినట్లు సమాచారం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..