Uttam Kumar Reddy: ఈ నెలాఖరులో తెలంగాణలో రాష్ట్రపతి పాలన.. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ షాకింగ్ కామెంట్స్..

|

Feb 05, 2023 | 6:01 PM

కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈనెల చివరి నాటికి తెలంగాణలో శాసన సభ రద్దయి.. రాష్ట్రపతి పాలన వస్తుందని చెప్పారు. రాష్ట్రపతి పాలనలో ముందస్తు ఎన్నికలు జరపాలని కేంద్రాన్ని..

Uttam Kumar Reddy: ఈ నెలాఖరులో తెలంగాణలో రాష్ట్రపతి పాలన.. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ షాకింగ్ కామెంట్స్..
Uttam Kumar Reddy
Follow us on

కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈనెల చివరి నాటికి తెలంగాణలో శాసన సభ రద్దయి.. రాష్ట్రపతి పాలన వస్తుందని చెప్పారు. రాష్ట్రపతి పాలనలో ముందస్తు ఎన్నికలు జరపాలని కేంద్రాన్ని కోరతామన్నారు. రాహుల్‌గాంధీ చేసిన భారత్ జోడో యాత్రతో దేశంలో కాంగ్రెస్‌ గాలి వీస్తోందని చెప్పారు. దేశాన్ని బీజేపీ మతపరంగా చిన్నాభిన్నం చేసిందని మండిపడ్డారు. కోదాడ, హుజుర్‌నగర్‌లో కాంగ్రెస్‌కు 50 వేల మెజార్టీ వస్తుందన్న ఆయన.. ఆ మెజారిటీ రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టం చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. కోదాడ అసెంబ్లీ స్థానం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగారు. ఈ స్థానం నుంచి విజయం సాధించారు.

కాగా.. గతంలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉందన్న ఆమె.. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఘాటు వ్యాఖ్యలు చేసారు. రాజశేఖర్ రెడ్డి జల యజ్ఞం, ఫీజు రియంబర్స్ మెంట్ , ఆరోగ్య శ్రీ అన్ని పధకాలు తీసుకువచ్చారన్నారు. తెలంగాణను అప్పుల మయం చేశారని మండిపడ్డారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ పేరుతో విద్యార్థుల ను మోసం చేశారన్న షర్మిల.. ఆరోగ్య శ్రీ కి తూట్లు పొడిచారని విమర్శించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం