Jagga Reddy: బీజేపీ గవర్నర్ తమిళిసైని మార్చొచ్చు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వాఖ్యలు..
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన మనస్సులో ఏది ఉన్నా ఇట్టే బయటకు చెప్పేస్తారు. ఇప్పుడు అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తానూ ఎవరికి బానిస కాదు..ఎవరికి లాలూచీ పడనన్నారు.
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన మనస్సులో ఏది ఉన్నా ఇట్టే బయటకు చెప్పేస్తారు. ఇప్పుడు అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తానూ ఎవరికి బానిస కాదు.. ఎవరికి లాలూచీ పడనన్నారు. పేదలకు సాయం అవుతుంది అంటే.. ఎదుటి వాళ్ళు ఎంత బలవంతులు అయినా చూడనన్నారు జగ్గారెడ్డి. రాజకీయంగా బీఆర్‌ఎస్‌ని తిట్టి అహో.. అనిపించుకోవాలి అనే దానికంటే.. ప్రజల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించానన్నారు. సీఎం కేసీఆర్‌ని తిడితే పది మంది సంతోష పడతారు కానీ.. సమస్యలు చెప్తే పరిష్కారం అయినా అవుతుందన్నారు. సదాశివపేట వరకు మెట్రో కావాలని డిమాండ్ లేవనెత్తినట్లు జగ్గారెడ్డి తెలిపారు. అంతేకాకుండా.. కేసీఆర్ కిట్‌తో మహిళలకు బెనిఫిట్ అవుతుందని, అది అంతా ఒప్పుకోవాల్సిందేనన్నారు. కల్యాణలక్ష్మీ మంచి పథకమేనని, మంచిని మంచి అనాల్సిందేనని జగ్గారెడ్డి అన్నారు.
వీఆర్‌ఏ, ఐకేపీల సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, యాదగిరిగుట్ట పునర్నిర్మాణం మంచి నిర్ణయమేనన్నారు జగ్గారెడ్డి. అక్కడికి కూడా మెట్రో వేయాలని, అనాథ పిల్లకు వసతి గృహాలు ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. ఇక అసెంబ్లీలో గవర్నర్ తీరుపై బీజేపీ అసంతృప్తి తో ఉన్నట్టు ఉందని, గవర్నర్‌ను మార్చొచ్చని జగ్గారెడ్డి అన్నారు. కానీ బీజేపీ తెలంగాణలో ఎన్ని గేమ్ లు ఆడినా…రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రాదన్నారు. తనకు కాంగ్రెస్ కంటే బీజేపీ చరిత్ర ఎక్కువ తెలుసున్నారు జగ్గారెడ్డి. జాతీయ భావాలతో రాహుల్‌గాంధీ పాదయాత్ర చేశారని, ఆర్థికవేత్త మన్మోహన్‌సింగ్‌ని ప్రధాని చేసిన చరిత్ర రాహుల్,సోనియా గాంధీలదన్నారు. బీజేపీ లాగా ఆదానీ.. అంబానీలను పెంచలేదని, అన్ని గ్రామాల్లో అందరూ బాగుండాలని ఉపాధి హామీ తెచ్చింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..