Munugode By poll: మునుగోడు ప్రచారంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నిరసన సెగ.. రాళ్లు రువ్వుకున్న కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు

బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. అంతేకాదు స్థానికంగా బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.

Munugode By poll: మునుగోడు ప్రచారంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నిరసన సెగ.. రాళ్లు రువ్వుకున్న కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు
Munugode By Poll

Updated on: Oct 24, 2022 | 8:11 AM

మునుగోడులో ఉపఎన్నికల నేపథ్యంలో రాజకీయ నేతలు, కార్యకార్తలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు  చేసుకుంటున్నాయి. అయితే బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య వార్ పీక్ స్టేజ్ కు చేరుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా  చౌటుప్పల్ మండలం ఎస్ లింగోటంలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. అంతేకాదు స్థానికంగా బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.

ఇరు పార్టీకి చెందిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లదాడి చేసుకున్నారు. ఈ రాళ్ల దాడిలో పలువురు గాయపడ్డారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటన స్థలంలో భారీగా మోహరించిన పోలీసులు.. ఇరువర్గాలను చెదరగొట్టారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..