Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌పై ప్రియాంక గాంధీ ఫోకస్ పెట్టారు. ఇక నుంచి టి.కాంగ్రెస్ నిర్ణయాలపై ప్రియాంక గాంధీ ఆమోదం తప్పనిసరి చేశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలుపుకుని పోవాలని టి.కాంగ్రెస్ నేతలకు సూచించారు ప్రియాంక. ప్రియాంక సూచనలతో వెంకట్‌రెడ్డిని కలవనున్నారు మధుయాష్కీ, దామోదర రాజనర్సింహ. తెలంగాణ పాలిటిక్స్‌లో ప్రియాంక ఎంట్రీపై సీనియర్ నేతల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపై తెలంగాణకు పూర్తి సమయం కేటాయిస్తానని ప్రకటించారు ప్రియాంక. ఎవరైనా ఎప్పుడైనా నన్ను కలిసి సమస్యలు చెప్పుకోవచ్చని స్పష్టం చేశారు. మీరు కలిసి పని చేస్తే మీకే లాభం, పార్టీ అధికారంలోకి రాకపోతే ..పార్టీతో పాటు మీరంతా నష్టపోతారని తేల్చి చెప్పారు.అందరూ కలిసి పని చేయాలని.. మునుగోడులో విజయం సాధించాలని కోరారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో మాట్లాడే బాధ్యతను దామోదర రాజనర్సింహ,మధు యాష్కీలకు అప్పగించారు. అలాగే మునుగోడు అభ్యర్ధి ఎంపికపై ఏఐసీసీ కార్యదర్శులు ఇవాళ్టి నుండే కసరత్తు చేయాలని ప్రియాంకా గాంధీ ఆదేశించగా.. జిల్లా నాయకుల అభిప్రాయాలు సేకరించాలని ఆదేశించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..