Damodara Rajanarsimha all down from Bullock cart: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ప్రదర్శనలో అపశృతి చోటుచేసుకుంది. మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ స్వల్పంగా గాయపడ్డారు. చమురు ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వ తీరుపై ఎడ్ల బండి పై నుండి ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా జారి కిందపడ్డారు. మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కాలికి గాయాలు అయ్యాయి. దీంతో ఆయనను కార్యకర్తలు హుటాహుటీన సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహా మాట్లాడుతుండగా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో బెదిరిన ఎడ్లు పరిగెత్తేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కిందపడ్డారు. కాగా, చికిత్స అనంతరం కోలుకున్న దామోదర కాలినడకన నిరసన ర్యాలీ చేపట్టారు
ఇదిలావుంటే, రోజు రోజుకు ఆకాశనంటుతున్న పెట్రోల్, డిజీల్ ధరలపై దేశవ్యాప్తంగా నిరసన తెలపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే మెదక జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు తెలిపారు. అటు వరంగల్ అర్బన్ జిల్లాలో కాజీపేట నుంచి హన్మకొండ చౌరస్తా వరకు సైకిళ్లు, ఎడ్ల బండ్లు, రిక్షాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు క్రూడాయిల్ ధర లీటర్కు 70 రూపాయలు ఉంటే ఇప్పుడు 40 రూపాయలు ఉందన్నారు. అప్పుడు లీటర్ పెట్రోల్ ధర 71రూపాయలు ఉంటే.. ఇప్పుడు అది 105 రూపాయలకు చేరిందని రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు.
Read Also..Bhatti Vikramarka: పెట్రోల్ ధరలకు నిరసనగా ఖమ్మంలో భట్టి విక్రమార్క శపథం.!