Bhatti Vikramarka: వందో రోజుకి చేరిన భట్టి ‘పిపుల్స్ మార్చ్’.. పట్టు విడవని విక్రమార్కుడిలా ప్రజలతో కలిసి..

|

Jun 23, 2023 | 11:17 AM

Bhatti Vikramarka Peoples March Padayatra: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, శాసన సభ ప్రతిపక్ష నాయకుడు మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పిపుల్స్ మార్చ్ పాదయాత్ర శుక్రవారంతో వందో రోజులకు చేరింది. రాష్ట్ర రాజకీయాల్లో ఓ బ్రాండ్‌గా..

Bhatti Vikramarka: వందో రోజుకి చేరిన భట్టి ‘పిపుల్స్ మార్చ్’.. పట్టు విడవని విక్రమార్కుడిలా ప్రజలతో కలిసి..
Bhatti Vikramarka's Peoples March Padayatra
Follow us on

Bhatti Vikramarka Peoples March Padayatra: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, శాసన సభ ప్రతిపక్ష నాయకుడు మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పిపుల్స్ మార్చ్ పాదయాత్ర శుక్రవారంతో వందో రోజులకు చేరింది. రాష్ట్ర రాజకీయాల్లో ఓ బ్రాండ్‌గా ఉన్న ఆయన.. పట్టు విడవని విక్రమార్కుడిలా నడిచిన ఈ పాదయాత్రతో కొత్త ట్రెండ్‌ సెట్టర్‌గా మారారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతల మధ్య ఐక్యతకు వేదికగా ఆయన చేపట్టిన పిపుల్స్ మార్చ్ నిలిచింది. ముఖ్యంగా విక్రమార్క చేపట్టిన ఈ పాదయాత్రకు కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి ఇచ్చిననాటి నుంచి పార్టీలో చేరికల సంఖ్య పెరిగింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా భట్టి కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో భట్టి చీఫ్ విప్‌గా.. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్‌గానూ చేశారు. ఇంకా ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే గతేడాది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నుంచి స్ఫూర్తి పొందిన విక్రమార్క పిపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్రను ప్రారంభించారు. మార్చి 16న అదిలాబాద్ బోథ్ నియోజకవర్గంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర.. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరి పోస్తోంది.

వందో రోజుకి చేరిన ఈ పిపుల్స్ మార్చ్ పాదయాత్రతో బడుగు బలహీన వర్గాలవారికి భట్టి దగ్గరయ్యారు.  భట్టి చేపట్టిన ఈ పాదయాత్రకు లభిస్తున్న విశేష ఆదరణను చూసి కాంగ్రెస్ అధినేత మల్లిఖార్జున ఖర్గే సహా పలువురు తరలి రావడమే కాక సభల్లో పాల్గొన్నారు. స్వయంగా రాహుల్ గాంధీ కూడా ఈ పాదయాత్ర గురించి ఆడిగి తెలుసుకుంటున్నారు. అంతేనా.. భట్టి తన పాదయాత్రలో భాగంగా పలువురు నాయకులను బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఫలితంగానే ఖమ్మం వేదికగా పలువురు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దమయ్యారు.

ఇవి కూడా చదవండి

ఇంకా పీపుల్స్ మార్చ్‌ పాదయాత్రలో భాగంగా గడిచిన వంద రోజుల్లో భట్టి అనారోగ్యం కారణంతో చిన్న విరామం మినహా ఎక్కడా ఆగలేదు. పండగ పబ్బం అని లేకుండా అనునిత్యం ప్రజలతోనే నడిచారు. ఎండలోనే వందో రోజు వరకు నడిచిన ఆయన.. ఇప్పటివరకు 1150 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేశారు. ఇదిలా ఉండగా.. వందో రోజు పాదయాత్ర నల్లగొండ నకిరేకల్ నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా పలువురు నేతలు భట్టిని పరామర్శించి, ప్రశంసలతో ముంచెత్తారు.

మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.