తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు ఆ ఎంపీ స్థానం ఛాలెజింగ్‌గా మారింది. అక్కడ రెండు విపక్షాలు బలంగా ఉన్నాయి. అటు బీజేపీ, ఇటు బీఆర్‌ఎస్ గట్టి పోటినిచ్చే ఆ స్థానంలో కాంగ్రెస్ ఏమేర ఓట్లు సాధిస్తుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ పార్టమెంట్ స్థానం ఎక్కడ.? అంతలా పోటీ ఉండడానికి కారణం ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
కరీంనగర్ పార్లమెంట్ సీటు గెలవడం కాంగ్రెస్ కి కీలకంగా మారింది. ఇక్కడ రెండు విపక్షాలు బలంగా ఉన్నాయి. ఈ పార్లమెంట్ పరిధిలిలో బీఆర్‌ఎస్ గట్టి పోటీనిస్తుంది. అలాగే బీజేపీ కూడా ఓటింగ్ శాతాన్ని పెంచుకుంది. ఇన్ని సవాళ్లను అదిగమించి కాంగ్రెస్ ముందుకు వెళ్లే ప్లాన్ చేస్తుంది. తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ కీలక పాత్ర పోషించింది. ఇక్కడి నుంచి కేసీఆర్ ఎంపీగా పోటీ చేసి ఉద్యమాన్ని ఉదృతం చేశారు. అంతేకాదు.. ప్రతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఇక్కడి ప్రజలు ఆదిరంచారు.
అయితే 2019 ఎన్నికల్లో మాత్రం బీజేపీ గట్టి షాక్ ఇచ్చింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి సంజయ్ విజయం సాధించారు. తర్వాత బీఆర్‌ఎస్ బలహీనపడుతూ వచ్చింది. మొన్న జరిగిన ఆ సెంబ్లీ ఎన్నికల్లో నాలుగు సిట్టింగ్ ఎమ్మెల్యేలను కోల్పోయింది. అయితే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలిలో కాంగ్రెస్ కంటే బీఆర్‌ఎస్‌కి ఎక్కువ ఓట్లు వచ్చాయి. అదేవిధంగా బీజీపీ ఓటు బ్యాంకును గణనీయంగా పెంచుకుంది. ఇక్కడ బీజేపీ నుంచి సంజయ్, బీఆర్‌ఎస్ నుంచి వినోద్ మరోసారి బరిలోకి దిగనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. హుస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కరీంనగర్ పార్లమెంట్ బాధ్యతలు అప్పజెప్పారు.
గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడవ స్థానికి పరిమితమైంది. ఇప్పడు. కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఈ సీటుపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే, కాంగ్రెస్ నేతలు వర్క్ ప్రారంభించారు.. ఇందులో భాగంగానే బలమైన క్యాండిట్ కోసం దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతం ఎంఎల్సీ జీవన్ రెడ్డి, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరి ప్రణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగపతిరావు తనయుడు వెలిచాల రాజేందర్ రావు పేర్లు వినిపిస్తున్నాయి. కరీంగనర్‌లో బీజేపీ, బీఆర్‌ఎస్‌లను ఎదుర్కోవాలంటే.. బలమైన నేత కావాలి, అంతేకాకుండా.. బండి సంజయ్ దూకుడుగా వెళ్తున్నారు. ఇప్పటికే.. ఎన్నికల కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వినోద్ కూడా… ప్రచారం మొదలుపెట్టారు.
ఇక కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో నలుగురు కాంగ్రెస్ అభ్యర్థులు తాజా ఎన్నికల్లో విజయం సాధించారు.. కరీంనగర్ ఎంపీ స్థానం ఇటు నిజామాబాద్‌తో పాటు, పెద్దపల్లి స్థానంపై ప్రభావం చూపుతుంది. దీంతో కాంగ్రెస్ నేతలు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. కరీంనగర్ అసెంబ్లీ స్థానంపై మరింత దృష్టి పెడుతున్నారు. ఇక్కడ.. ఇతర పార్టీల చెందిన నేతలను.. పార్టీలో చేర్పించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. గత ఎంపీ ఎన్నికల్లో మూడవ స్థానంలో ఉన్న కాంగ్రెసు ఇప్పుడు మొదటి స్థానంలోకి తీసుకురావడంపై దృష్టి సారిస్తున్నారు. కరీంనగర్ అసెంబ్లీలో సుమారు గా 3 లక్షల 50 వేల ఓట్లు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ బలహీనంగా ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో.. కరీంనగర్‌లో కాంగ్రెస్‌కి కేవలం 40 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఈ స్థానంపై మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు ముఖ్య నేతలంతా దృష్టిసారించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..