తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లో టికెట్ల కోసం అధికార కాంగ్రెస్ పార్టీకి 306 ఆశావహులు అప్లయ్ చేసుకున్నారు. సికింద్రాబాద్ లోక్‌సభ టికెట్ కోసం వేణుగోపాల స్వామి, అనీల్ కుమార్ యాదవ్, రోహిణ్ రెడ్డి సహా కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ రామ్ మోహన్ రెడ్డి దరాఖస్తులు దాఖలు చేశారు. సొంత గూటిలోనే ఇంత మంది పోటీ పడుతున్నారు. ఐతే కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ..కాపు ఈక్వెషన్‌తో సరైన క్యాండిడేట్‌ను సికింద్రాబాద్ నుంచి బరిలోకి దింపాలని చూస్తుందనేది పొలిటికల్ సర్కిల్స్ ఓ టాక్ చక్కర్లు కొడుతోంది. ఇటీవల సీఎం రేవంత్‌తో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ములాఖత్‌లు ఓ చర్చగా మారితే.. తాజాగా గ్రేటర్ తాజా మేయర్ గద్వాల విజయలక్ష్మి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌లు కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్నారని, చర్చలు కూడా జరిపారనే మ్యాటర్ మరో సంచలనమైంది.
ఈ ఇద్దరూ జెండా మార్చే అవకాశం వుందా?
గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి డాటరాఫ్ కె.కేశవరావు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్-కేకే మధ్య స్నేహబంధం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. అలాంటిది కేకే కూతురైన విజయలక్ష్మి పార్టీ మారే అవకాశం వుంటుందా? అనేది ఒకపాయింట్.. ఎట్ ద సేమ్ టైమ్ కేకే గతంలో కాంగ్రెస్‌లోనూ కీలక నేతగా పనిచేశారు కాబట్టీ ఏమో రాజకీయాల్లో ఏదైనా సంభవమే ఆనేది మరో టాక్. మేయర్ విజయలక్ష్మి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడంతో ఊహాగానాలు మరింతగా షికారు చేశాయి.
ఇక బొంతు రామ్మోహన్ తెలంగాణ ఉద్యమం నాటి నుంచి కేసీఆర్ వెంటవున్నారు. గ్రేటర్ హైదరాబాద్ తొలి మేయర్‌గా పనిచేశారు. ఐతే అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో టికెట్‌ను ఆశించారు. కారణాలు ఏవైనా ఆయనకు టికెట్ రాలేదు. ఆ తరువాత పార్టీ కార్యక్రమాల్లో ఆయన సందడి అంతగా కన్పించలేదు. లోక్‌సభ ఎన్నికల ముంగిట్లో మళ్లీ ఆయన పేరు తెరపైకి వచ్చింది. కాంగ్రెస్‌తో టచ్‌లోకి వెళ్లారనే ప్రచారం జోరందుకుంది.
ఊహాగానా ల క్రమంలో క్లారిటీ ఇచ్చారు తాజా,మాజీ గ్రేటర్ మేయర్లు గద్వాల విజయలక్ష్మి, బొంతు రామ్మోహన్ . తాను సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నది నిజమే.. ఆ విషయం హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్లా.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తన విజ్ఞప్తిని అంగీకరిస్తారనే నమ్మకం వుందని ట్వీట్ చేశారు. ఒకే కుటుంబం వారి కాకుండా ఉద్యమకారులకు, పార్టీ కోసం పనిచేసి వాళ్లకు టికెట్ ఇవ్వాలని కోరానన్నారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న కథనాలు వాస్తవం కాదంటూనే ఏ పార్టీలో జాయిన్ అవ్వాలనే నిర్ణయం తీసుకోలేదని ట్వీట్ చివరల్లో పేర్కొన్నారు బొంతు రామ్మోహన్.
ఇక సీఎం రేవంత్ రెడ్డితో భేటీ వెనుక ఎలాంటి రాజకీయ కోణంలేదని క్లియర్‌కట్ క్లారిటీ ఇచ్చారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. అసెంబ్లీ ఎన్నికల కోడ్ వలన 5 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ కమిటీల ఏర్పాటు, జనరల్ బాడీ మీటింగ్ పై సీఎంతో చర్చించానన్నారు. ఆయన సానుకూలంగా స్పందించారన్నారు.
అదీ మ్యాటర్. అలా ఒకరి ఆవాజ్.. మరొకరి ట్వీజ్ తెరపైకి వచ్చాయి. ఫిర్ బీ నిప్పులేనది పొగరాదనే చర్చ తాజారాజకీయాల్లో సెగరాజేస్తూనే ఉంది. సికింద్రాబాద్ లోక్‌సభలో బీజేపీ తెలంగాణ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా వున్నారు. లష్కర్‌ను ఎలాగైనా చేజిక్కించుకోవాలనే టార్గెట్‌తో కాంగ్రెస్‌ఆపరేషన్ ఆకర్షన్ చేపట్టిందా? సొంత పార్టీలో పోటీపడుతున్న వాళ్లను కాదని బొంతు రామ్మోహన్‌లాంటి వాళ్లను బరిలోకి దించాలని ప్రయత్నిస్తుందా? ఇలా ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. ఇక నిజాలేంటో రేపో మాపో తెరపైకి రాకుండా వుంటాయా? వెయిట్ అండ్‌వాచ్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..