బిఆరెస్‌తో పొత్తు అని చెప్పి అభ్యర్థులను ప్రకటించిన కెసిఆర్ మిత్ర ద్రోహం చేసారంటు ఆగ్రహంగా ఉన్న వామపక్ష పార్టీలకు.. కాంగ్రెస్ పార్టీ స్నేహహస్తం అందిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలకుండా ఉండాలంటే అందరం కలిసి పని చేద్దామంటూ ఏఐసిసి ఇంచార్జ్ థాక్రే ఇరు పార్టీల కార్యదర్శులకు పోన్ చేశారు. దీంతో ఇరు పార్టీల నేతలతో కాంగ్రెస్ చర్చలు ప్రారంభించింది. ఆదివారం నాడు సిపిఐ నేతలతో థాక్రే రహస్య మంతనాలు చేశారు. థాక్రే తో జరిగిన సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, అజిజ్ పాషా లు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోరాడుదామని ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా కలిసి పని చేద్దామని థాక్రే సిపిఐ నేతలతో చర్చించారు.
థాక్రే ముందు 4 సీట్లు సిపిఐ ప్రతిపాదనలు పెట్టింది. మునుగోడు, బెల్లంపల్లి, కొత్తగూడెం, హుస్నాబాద్ స్థానాలు అడుగుతుంది. మునుగోడు, హుస్నాబాద్ ఇవ్వడానికి కాంగ్రెస్ సుముఖంగా ఉంది. వీటితో పాటు ఒక ఎమ్మెల్సీ స్థానం కూడా ఇవ్వడానికి కాంగ్రెస్ సిపిఐ నేతలతో తెలిపింది. కొత్తగూడెంకి కాంగ్రెస్ నుండి భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఇక్కడ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని పోటీ చేయాలని భావిస్తున్నారు. బిఆరెస్ తో పొత్తులో కూడా కొత్తగూడెం వస్తుందని భావించి చాలా నెలలుగా అక్కడ కూనంనేని పని చేస్తున్నారు. ఇక ఇతర స్థానాల్లో కూడా కాంగ్రెస్, సిపిఐ లు బలంగా ఉన్నాయి.
సిపిఎం కూడా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. సిపిఎం పాలేరు, మిర్యాలగూడతో పాటు మరో రెండు స్థానాలు అడుగుతుంది. నిర్ధిష్ట ప్రతిపాదన వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని పార్టీ నేతల సమావేశంలో తమ్మినేని వీరభద్రం తెలిపారు. రేపు సిపిఎంతో కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపే అవకాశం ఉంది.
బిఆరెస్ పొత్తు చెడిన తరువాత వామపక్షలకు కాంగ్రెస్ స్నేహహాస్తాన్ని ఉపయోగించుకొని చట్టసభల్లో అడుగుపెడుతుందా లేక సీట్ల తో పంతానికి పోయి పోటీకే మాత్రమే పరిమితం అవుతుందా చూడాలి మరి.
Congress President Shri @kharge, joined by Shri @revanth_anumula and a multitude of attendees, ignited a sea of mobile touchlights in a public gathering in Telangana, illuminating the way forward with a resounding beacon of hope for a brighter tomorrow.#ChevellaSCSTDeclaration pic.twitter.com/G0Qxq8meqg
— Congress (@INCIndia) August 26, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..