Traffic Challan: తెలంగాణలో పెండింగ్ చలాన్లపై(Pending challans) ప్రభుత్వం భారీ తగ్గింపుతో చెల్లించేందుకు అవకాశం కల్పించింది. మెుదటి రోజు భారీ స్పందన రావటం వల్ల సర్వర్లు సైతం క్రాష్ అయ్యాయి. ప్రభుత్వం కూడా దీని ద్వారా ఖజానాకు(Income to Treasery) మంచి ఆదాయం వస్తుందని భావించింది. 18 రోజులు గడిచిన తరువాత ప్రస్తుతం కలెక్షన్లకు సంబంధించిన వివరాలు చూస్తుంటే పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఇప్పటి వరకు 1.3 కోట్ల పెండింగ్ చలాన్లను వాహనదారులు చెల్లించారు. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.135 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వహనదారుల నుంచి దీనికి ఎక్కువ స్పందన వచ్చింది. ఆ తరువాత సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలోని వాహనదారులు ఈ అవకాశాన్ని ఎక్కువగా సద్వినియోగం చేసుకుంటున్నారు.
రాష్ట్రంలో మెుత్తం 6 కోట్ల పెండింగ్ చలాన్లు ఉన్నాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ. 1,750 కోట్లు రావలసి ఉంది. ఈ నెల 1 నుంచి పోలీసు శాఖ భారీ తగ్గింపుతో పెండింగ్ చలానాల చెల్లింపులకు అవకాశం కల్పించింది. వీటి ద్వారా కనీసం రూ. 500 కోట్లు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ.. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే వాహనదారుల నుంచి ఆ స్థాయిలో స్పందన రావటం లేదని కనిపిస్తోంది. మెుత్తం చెలానాల్లో కేవలం 25 శాతం మాత్రమే వసూలు అయ్యాయి. దీనిపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. చాలా మందికి ఈ రాయితీని వినియోగించుకోవటం ఎలాగో తెలియటం లేదని పోలీసులు భావిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా మీసేవ కేంద్రాల్లో చెల్లింపు అవకాశం కల్పించినప్పటికీ.. చాలా మంది ముందుకు రావటం లేదు. నెలాఖరు నాటికి 90 శాతం వరకు పెండింగ్ చెలాన్ల సొమ్ము రికవరీకి అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఇవీ చదవండి..
Insurance: ఇన్సూరెన్స్ కవర్ మీ అవసరాలకు సరిపోతుందా..? అయితే ఇలా ప్లాన్ చేసుకోండి..
Anand Mahindra: ప్రధాని మోదీ రోడ్‌షోపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్.. ఇంతకీ ఏమన్నారంటే..