TPCC: కాంగ్రెస్‌లో కోల్డ్ వార్ షురూ.. రేవంత్‌పై గుర్రుగా ఉన్న సీనియర్ నేతలు.. కలిసేందుకు నో ఛాన్స్!

|

Jul 01, 2021 | 9:10 PM

Ashok Bhimanapalli, TV9 Reporter Hyderabad : తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ చిచ్చు పైకి సైలెంట్‌గా కనిపిస్తున్న లోలోన రగులుతూనే ఉంది. టీపీసీసీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డికి

TPCC: కాంగ్రెస్‌లో కోల్డ్ వార్ షురూ.. రేవంత్‌పై గుర్రుగా ఉన్న సీనియర్ నేతలు.. కలిసేందుకు నో ఛాన్స్!
Revanth Reddy
Follow us on

Ashok Bhimanapalli, TV9 Reporter Hyderabad : తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ చిచ్చు పైకి సైలెంట్‌గా కనిపిస్తున్న లోలోన రగులుతూనే ఉంది. టీపీసీసీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డికి అధిష్టానం అవకాశం ఇవ్వడంతో సీనియర్ల అసంతృప్తి కొనసాగుతూనే ఉంది. రేవంత్ పీసీసీ చీఫ్ కావడం ఇష్టం లేని నేతలు.. ఇప్పటికి గుర్రుగానే ఉన్నారు. ఒకరిద్దరూ బహిరంగంగా మాట్లాడుతున్నప్పటికీ.. చాలామంది నేతలు లోలోన రగులుతున్నట్లు పేర్కొంటున్నారు. అయితే.. ప్రస్తుతం కాంగ్రెస్‌లో కొనసాగుతున్న దాగుడు మూతల వ్యవహారం ఇంకెన్ని రోజులు కొనసాగుతుందనేది హాట్ టాపిక్‌గా మారింది. రేవంత్ రెడ్డి ఈ వ్యవహారానికి ఫుల్‌స్టాప్ పెట్టి ఎలా సమన్వయం చేస్తారన్నది కాంగ్రెస్‌ కేడర్‌లో బలమైన ప్రశ్నగా మారింది. అంతర్గత పోరు ఉంటే.. మున్ముందు పార్టీకి నష్టమేనంటూ.. మధ్యస్థ నేతలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.

కొత్తగా టీపీసీసీ చీఫ్‌గా నియమితులైన రేవంత్ రెడ్డి.. అధిష్టానం సూచనల మేరకు సీనియర్లను కలవాలని నిర్ణయించుకున్నారు. అందుకు అనుగుణంగానే.. పీసీసీ ప్రకటన వెలువడగానే..రేవంత్ చాలా మంది సీనియర్ల ఇళ్ల చుట్టూ చక్కర్లు కొడుతూ కలిసి వచ్చారు. ఫస్ట్ సీనియర్ నేత జానారెడ్డి కలిసి మద్దతు కోరారు. అలాగే షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, సుదర్శన్ రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ తదితర నివాసాలకు వెళ్లి మద్దతు కోరారు. అలాగే ఆనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సీనియర్ నేత వీహెచ్‌ను కూడా కలిసి మద్దతు తీసుకున్నారు రేవంత్ రెడ్డి.

అయితే ఇప్పుడు వచ్చిన చిక్కల్లా.. అసలైన అసంతృప్త నేతలతోనేనని పలువురు పేర్కొంటున్నారు. రేవంత్ ఇప్పటి వరకు సీనియర్లు, బలమైన నేతలను కలవాలని చేస్తున్న ప్రయత్నాలు వర్క్ అవుట్ కావడం లేదు. రేవంత్ వచ్చి కలుస్తానంటే.. తాము ఇంట్లో లేమంటూ దాగుడు మూతలు ఆడుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డికి సమయం ఇవ్వడం లేదంటూ సమాచారం. ఇప్పుడు ఈ ఇష్యూ గాంధీ భవన్ లో హాట్ టాపిక్ గా మారి కోడై కూస్తోంది.

మొత్తంగా ఆయన వస్తానంటే వీళ్లు ఏమంటారో..? ఒకవేళ కలిస్తే.. ఏమవుతుందో..? అంతర్గత పోరు సమసిపోతుందా..? లేక మరింత ముదురుతుందా..? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఎటు చూసినా.. సీనియర్లతో కొత్త చీఫ్ రేవంత్‌కు చిక్కులు తప్పుతాయా..? లేక ఇలానే ఉంటాయా..? ఫైనల్‌గా ఈ సమస్యకు ఎప్పటి వరకు పుల్‌స్టాప్ పడుతుందనేది వేచి చూడాల్సిందే..

Also Read:

Revanth Reddy: వైఎస్సార్, ఎన్టీఆర్‌ను తిట్టినవారంతా నికృష్టులే.. రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్..

Huzurabad By Election: హూజురాబాద్‌ నేతలకు బంపర్ ఆఫర్.. ఉప ఎన్నికల్లో మద్దతు ఇస్తే కారు గిఫ్ట్ !?