Revanth Reddy: కేసీఆర్ తన పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి: సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

|

Dec 05, 2024 | 1:48 PM

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వానికి విపక్ష నేతలు సూచనలు ఇచ్చే సంప్రదాయం గతంలో ఉండేదన్నారు.. ఆ సంప్రదాయాన్ని ఇప్పుడు దెబ్బతీస్తున్నారంటూ మండిపడ్డారు.. పాలక, ప్రతిక్షాలు అంటే శత్రుపక్షాలు అన్నట్టుగా వాతావరణం సృష్టించారని.. ప్రభుత్వం అంటే 64 మంది కాంగ్రెస్ సభ్యులు మాత్రమే కాదుని.. 119 మంది సభ్యులు కలిస్తేనే ప్రభుత్వం అంటూ వివరించారు.

Revanth Reddy: కేసీఆర్ తన పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి: సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
Revanth Reddy
Follow us on

పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి.. ఇప్పటికైనా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి.. అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం అంటే కేవలం కాంగ్రెస్ సభ్యులే కాదు.. 119 ఎమ్మెల్యేలు అంటూ తెలిపారు. ప్రభుత్వంలో కేసీఆర్ ప్రతిపక్షనాయకుడి బాధ్యతను నిర్వర్తించాలంటూ కోరారు.. అసెంబ్లీలో ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి ఒకే ప్రాధాన్యం ఉంటుందని వివరించారు.. ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే కాకుండా.. సూచనలు ఇవ్వాలని కోరారు. గురువారం సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్‌ ను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి ప్రారంభించారు.. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వానికి విపక్ష నేతలు సూచనలు ఇచ్చే సంప్రదాయం గతంలో ఉండేదన్నారు.. ఆ సంప్రదాయాన్ని ఇప్పుడు దెబ్బతీస్తున్నారంటూ మండిపడ్డారు.. పాలక, ప్రతిక్షాలు అంటే శత్రుపక్షాలు అన్నట్టుగా వాతావరణం సృష్టించారని.. ప్రభుత్వం అంటే 64 మంది కాంగ్రెస్ సభ్యులు మాత్రమే కాదు.. 119 మంది సభ్యులు కలిస్తేనే ప్రభుత్వం అంటూ వివరించారు. ప్రతిపక్షనాయకుడిగా కేసీఆర్‌కు బాధ్యత లేదా అంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్. ప్రజాస్వామ్యంలో ఎవరి పాత్ర వాళ్లు పోషిస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. ఫామ్‌హౌస్‌లు, పార్టీ ఆఫీసులు కట్టుకోవడంలో చూపించిన శ్రద్ధ.. పేదల ఇళ్లు నిర్మించడంలో చూపించలేదని బీఆర్‌ఎ‌స్‌పై విమర్శలు చేశారు సీఎం రేవంత్. పేదల ఇళ్ల నిర్మాణంపై గత ప్రభుత్వంపై ఫోకస్ పెట్టలేదన్నారు. కేటీఆర్, హరీష్‌రావుది చిన్నపిల్లల మనస్తత్వం అంటూ కామెంట్ చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. వాళ్లది శాడిస్టిక్ మెంటాలిటీ అంటూ విమర్శలు చేశారు.

ఆత్మగౌరవంతో బతకాలనేది ప్రతి ఒక్కరి కల అని.. పేదల కలను ఆనాడే ఇందిరమ్మ గుర్తించిందన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.. కూడు, గూడు, గుడ్డ ప్రతి ఒక్కరికీ అందించాలనేది ఇందిరమ్మ ఆలోచన అని.. తెలిపారు. వ్యవసాయ ల్యాండ్ సీలింగ్ యాక్ట్‌తో పేదలకు పట్టాలు ఇచ్చారు .. ఒక్క తెలంగాణలోనే 35లక్షల భూ పంపకాలు చేపట్టారన్నారు.. ఆత్మగౌరవంతో బతకాలనే కల నెరవేరాలంటే సొంత ఇళ్లు ఉండాలన్నారు.. గుడి లేని ఊరు ఉండొచ్చేమో గానీ.. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదంటూ తెలిపారు.. లక్ష్యం ఎంత గొప్పదైనా అమలులో లోపం ఉంటే విశ్వసనీయత దెబ్బ తింటుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అసలైన అర్హులకే ఇళ్లు అందించే ప్రయత్నం చేస్తున్నామని.. ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్ల పరిశీలనతో పాటు.. ఏఐని ఉపయోగించి లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చామని తెలిపారు.

5లక్షల ఆర్థిక సాయం..

ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్‌ ద్వారా ప్రభుత్వం దరఖాస్తుదారుల వివరాలను సేకరించింది.. పైలట్‌ ప్రాజెక్ట్‌గా మహబూబ్‌నగర్, నిజామాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్ జిల్లాల్లో వివరాల సేకరణ జరగనుంది.. తొలి విడతగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లను ప్రభుత్వం కేటాయించింది. సొంత నివాస స్థలాలు ఉన్నవారికి మొదటి విడతలో అవకాశం ఇవ్వనుననారు.. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి రూ.5లక్షల ఆర్థిక సాయం అందించనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..