Revanth Reddy: కేసీఆర్ వైఖరి ఆనాడేమైంది..? స్థానిక పోరుకు సిద్ధమవ్వండి.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

ఫిరాయింపులపై కేసీఆర్ వైఖరి ఆనాడేమైంది?.. పదేళ్లు తెలంగాణ నిర్లక్ష్యానికి గురైంది.. కేసీఆర్‌ను గెలిపిస్తే మనకు అన్యాయం చేశారు.. అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మంగళవారం పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డి.. కార్యకర్తల సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. KCRను ఓడించాలని కార్యకర్తలంతా కష్టపడి పనిచేశారని.. తప్పకుండా గుర్తింపునిస్తామన్నారు.

Revanth Reddy: కేసీఆర్ వైఖరి ఆనాడేమైంది..? స్థానిక పోరుకు సిద్ధమవ్వండి.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
Revanth Reddy
Follow us

|

Updated on: Jul 09, 2024 | 9:13 PM

ఫిరాయింపులపై కేసీఆర్ వైఖరి ఆనాడేమైంది?.. పదేళ్లు తెలంగాణ నిర్లక్ష్యానికి గురైంది.. కేసీఆర్‌ను గెలిపిస్తే మనకు అన్యాయం చేశారు.. అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మంగళవారం పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డి.. కార్యకర్తల సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. KCRను ఓడించాలని కార్యకర్తలంతా కష్టపడి పనిచేశారని.. తప్పకుండా గుర్తింపునిస్తామన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయని.. కార్యకర్తల కోసం నేతలంతా పనిచేయాల్సిన అవసరముందన్నారు. కార్యకర్తల్ని సర్పంచ్‌లు, MPTCలుగా గెలిపించుకోవాలని.. పార్టీ కోసం కష్టపడ్డ అందరికీ నామినేటెడ్ పదవులు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గత BRS పాలనలో కాంగ్రెస్‌ కార్యకర్తల్ని హింసించారు.. దాడుల సమయంలో కేసీఆర్‌ రాజనీతి ఎక్కడికి పోయింది.. అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ మారితే.. కేసీఆర్‌ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.. కాంగ్రెస్‌ కార్యకర్తల ఉసురు తగిలిందంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పడిపోవాలని ఇంకా విమర్శలు చేస్తున్నారు.. కేటీఆర్ ఢిల్లీలో మోదీ చుట్టూ తిరుగుతున్నారంటూ పేర్కొన్నారు. స్థానిక పోరుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. డీఎస్సీ వాయిదా వేయాలనడం కొందరి కుట్ర.. అన్న రేవంత్‌ రెడ్డి.. పేదపిల్లలు కాదు, హరీష్‌-కేటీఆర్‌ దీక్ష చేయాలంటూ సూచించారు. కేసీఆర్, కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారు.. మా ఎమ్మెల్యేలను గుంజుకున్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా.. అన్నారు. బీజేపీ, బీఆరెస్ ఒక్కటై ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశారంటూ పేర్కొన్నారు.

‘‘గ్రూప్స్, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని దొంగలు గూడుపుఠాని చేస్తున్నారు… కోచింగ్ సెంటర్ల మాఫియా పరీక్షలు వాయిదా వేయించాలని చూస్తోంది.. వాళ్ల ధనదాహం కోసం నిరుద్యోగుల జీవితాలతో చేలాగాటమాడుతున్నారు. పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే కోచింగ్ సెంటర్లు బతుకుతాయి. ఒక్కో కోచింగ్ సెంటర్లకు రూ.100కోట్ల ఫీజులు వస్తాయి.. 2022లో నోటిఫికేషన్లు ఇచ్చినవే… రెండేళ్ల నుంచి పరీక్షలు నిర్వహించలేదు.. పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి నష్టం లేదు.. నిరుద్యోగులు నష్టపోకూడదనేదే ప్రభుత్వ ఆలోచన’’.. అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

మహబూబ్ నగర్ పర్యటనలో సొంత జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 396.09 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పాలమూరు యూనివర్సిటీలో 42.40 కోట్లతో అభివృద్ధి పనులు.. ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 10కోట్లతో బాలికల హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన.. దేవరకద్రలో 6.10కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వీటితో పాటు మహబూబ్‌నగర్ రూరల్‌లో 3.25 కోట్లతో కేజీవీబీ భవన నిర్మాణం.. గండీడ్‌లో 6.20 కోట్లతో కేజీవీబీ భవన నిర్మాణం.. పాలమూరు యూనివర్సిటీలో 13.44 కోట్లతో ఎస్టీపీ, అకాడామిక్ బ్లాక్, గ్యాలరీ పనులు.. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో 37.87 కోట్లతో సీసీ రోడ్లు, స్టోరేజ్ ట్యాంక్ పనులు.. 276.80 కోట్లతో ఎస్టీపీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఇక జిల్లాలో ప్రధాన అంశమైన కల్వకుర్తి ప్రాజెక్ట్‌పైనా సీఎం రేవంత్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్.. 2025 డిసెంబర్‌లోగా కల్వకుర్తి ప్రాజెక్ట్‌ పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. అధికారులు ఫీల్డ్ విజిట్ చేసి యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు. గ్రీన్‌ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతినెలా పనుల్లో పురోగతిపై సమీక్ష నిర్వహించి.. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలన్నారు. అన్ని ప్రాజెక్ట్‌ల భూసేకరణ R&R చెల్లింపులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పాలమూరు-రంగారెడ్డి తప్ప మిగిలిన అన్ని ప్రాజెక్ట్‌లు 18 నెలల్లో పూర్తిచేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ప్రతి ప్రాజెక్ట్‌పై స్టేటస్ రిపోర్ట్‌తో పాటు.. గ్రామాల వారీగా ఆయకట్టు వివరాలు రూపొందించాలన్నారు. వివాదాలకు అవకాశం లేకుండా ప్రాజెక్ట్‌లపై ప్రతిపాదనలు రూపొందించాలి.. ప్రతి ప్రాజెక్ట్‌పై 30 రోజులకొకసారి సమీక్షించాలన్నారు సీఎం రేవంత్. సీఎం రేవంత్ సమావేశంలో ఎంపీ డీకే అరుణ కూడా పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్
యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్
హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్
హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్
ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..
ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..
భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ
భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ
ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో
ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!
పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!
మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!
రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!
రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!
లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.
లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.
'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!
'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!
రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!
రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!
గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్
గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్
25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం
25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం