Revanth Reddy: సీఎం క్యాంపు కార్యాలయం ఎక్కడో క్లారిటీ ఇచ్చిన రేవంత్ రెడ్డి.. చిట్‌చాట్‌లో ఏమన్నారో తెలుసా..?

|

Dec 14, 2023 | 6:29 PM

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక పరమైన అంశాలతోపాటు.. అభివృద్ధి తదితర విషయాలపై, కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రకటించిన హామీలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమావేశమవుతున్నారు. ఈ తరుణంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు సీఎం రేవంత్ రెడ్డి.. మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.

Revanth Reddy: సీఎం క్యాంపు కార్యాలయం ఎక్కడో క్లారిటీ ఇచ్చిన రేవంత్ రెడ్డి.. చిట్‌చాట్‌లో ఏమన్నారో తెలుసా..?
Revanth Reddy
Follow us on

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక పరమైన అంశాలతోపాటు.. అభివృద్ధి తదితర విషయాలపై, కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రకటించిన హామీలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమావేశమవుతున్నారు. ఈ తరుణంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు సీఎం రేవంత్ రెడ్డి.. మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల గురించి మాట్లాడారు. పాత అసెంబ్లీ బిల్డింగ్‌లో కౌన్సిల్ సమావేశాలు.. ఇప్పుడు ఉన్న అసెంబ్లీలో శాసనసభ జరుగుతుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ ఉండబోతోందని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా తన క్యాంపు కార్యాలయం గురించి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. అందరూ అనుకున్నట్లుగానే.. ఎంసీహెచ్ఆర్డిఐలో ఉన్న ఖాళీ స్థలంలో తన క్యాంపు ఆఫీస్ కార్యాలయం ఉంటుందని తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేటాయించిన జ్యోతిబాపూలే ప్రజా భవన్‌లో ఇంకో బిల్డింగ్ ఉందని.. అది మరో మంత్రికి కేటాయిస్తారని తెలిపారు.

రాయదుర్గం – శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో పనుల విస్తరణ, అలైన్ మెంట్ తదితర విషయాలపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. టెండర్లను నిలిపివేయాలని, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో విస్తరణ పనులపై కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాయదుర్గం నుంచి ఏయిర్పోర్ట్ వరకు మెట్రో ఉపయోగకరంగా ఉండదని.. మరోరూట్‌లో మెట్రో ప్లాన్ చేస్తామంటూ వివరించారు.

బుధవారం హైదరాబాద్ మెట్రో పనులపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇందుకు బదులుగా రెండు ప్రత్యామ్నాయాలను సూచించారు. చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, జల్‌పల్లి, విమానాశ్రయం రూట్‌తో పాటూ చాంద్రాయణగుట్ట, బార్కాస్, పహాడీషరీఫ్, శ్రీశైలం మార్గాన్ని అధ్యయనం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఇందులో ఏది ఖర్చు తక్కువైతే దానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..