CM Revanth Reddy: రైతుభరోసా పథకంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

|

Dec 11, 2023 | 8:42 PM

రైతులకు ఆర్థిక సాయం విషయంలో కాంగ్రెస్ వెనక్కి వెళ్లదని ఆ పార్టీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే తాము ఇస్తామన్న సాయం అర్హులకే అందేలా సమీక్ష చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వంలో రైతుల పేరిట భూస్వాములకు దోచిపెట్టారని ఆరోపించారు. అందుకే తాము సమీక్ష అనగానే బీఆర్‌ఎస్ నాయకుల గుండెల్లో గుబులు పుడుతుందన్నారు జీవన్‌రెడ్డి. అయితే, రైతుభరోసా నిధులను త్వరలోనే లబ్దిదారుల ఖాతాల్లో వేయాల్సి ఉండటంతో..

CM Revanth Reddy: రైతుభరోసా పథకంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
Revanth Reddy
Follow us on

కాంగ్రెస్ అమలు చేయనున్న రైతుభరోసా నిధులు అన్నదాతల ఖాతాల్లో ఎప్పుడు జమవుతాయనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే రేవంత్ సర్కార్ ఈ పథకం నిబంధనల్లో మార్పులు చేయొచ్చని పలువురు నేతలు సంకేతాలు ఇస్తున్నారు. తెలంగాణలో రైతు భరోసా నిధులు ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. అయితే ఈ పథకం గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు తరహాలోనే ఉంటుందా ? లేక ఇందులో మార్పులు చోటు చేసుకుంటాయా ? అన్నది ఆసక్తి రేపుతోంది. ఈ క్రమంలో రైతుభరోసాపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాము హామీ ఇచ్చిన విధంగా రైతులకు, కౌలు రైతులకు ఏటా ఎకరాకు 15వేలు రూపాయలు.. వ్యవసాయ కూలీలకు ఏటా 12వేలు రూపాయలు, వరి పంటకు 500 రూపాయల బోనస్ వంటి వాటిని ఏ విధంగా అమలు చేయాలనే దానిపై చర్చించారు. సమీక్షలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే రైతులకు ఆర్థిక సాయం విషయంలో కాంగ్రెస్ వెనక్కి వెళ్లదని ఆ పార్టీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే తాము ఇస్తామన్న సాయం అర్హులకే అందేలా సమీక్ష చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వంలో రైతుల పేరిట భూస్వాములకు దోచిపెట్టారని ఆరోపించారు. అందుకే తాము సమీక్ష అనగానే బీఆర్‌ఎస్ నాయకుల గుండెల్లో గుబులు పుడుతుందన్నారు జీవన్‌రెడ్డి. అయితే, రైతుభరోసా నిధులను త్వరలోనే లబ్దిదారుల ఖాతాల్లో వేయాల్సి ఉండటంతో.. ఈ పథకం కోసం రూపొందించాల్సిన మార్గదర్శకాలపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేవారు. టీవీ9తో మాట్లాడిన రామ్మోహన్ రెడ్డి రైతు భరోసా పథకం నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి