Telangana: నిరుద్యోగులను కొందరు కావాలనే రెచ్చగొడుతున్నారు: సీఎం రేవంత్‌రెడ్డి

|

Aug 26, 2024 | 8:11 PM

నిరుద్యోగులను కొందరు కావాలనే రెచ్చగొడుతున్నారని సీఎం రేవంత్ అన్నారు. గత ప్రభుత్వం ఎవరినీ పట్టించుకోలేదని.. తాము అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామని తెలిపారు. సోమవారం రాజీవ్‌ గాంధీ సివిల్స్‌ అభయ హస్తం చెక్కులను సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు పంపిణీ చేశారు. సివిల్స్‌లో ప్రిలిమ్స్ ఉత్తీర్ణత సాధించి మెయిన్స్‌కు ప్రిపేర్‌ అవుతున్న 135 మందికి ఆర్థికసాయం అందించారు...

Telangana: నిరుద్యోగులను కొందరు కావాలనే రెచ్చగొడుతున్నారు: సీఎం రేవంత్‌రెడ్డి
Cm Ravanth
Follow us on

నిరుద్యోగులను కొందరు కావాలనే రెచ్చగొడుతున్నారని సీఎం రేవంత్ అన్నారు. గత ప్రభుత్వం ఎవరినీ పట్టించుకోలేదని.. తాము అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామని తెలిపారు. సోమవారం రాజీవ్‌ గాంధీ సివిల్స్‌ అభయ హస్తం చెక్కులను సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు పంపిణీ చేశారు. సివిల్స్‌లో ప్రిలిమ్స్ ఉత్తీర్ణత సాధించి మెయిన్స్‌కు ప్రిపేర్‌ అవుతున్న 135 మందికి ఆర్థికసాయం అందించారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరికి రూ. లక్ష చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతామని, ఈ ఏడాది 100 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తామని పేర్కొన్నారు. కొందరు నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌.. నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు.

కేవలం 90 రోజుల్లోనే 30 వేల మందికి నియామక పత్రాలు అందించామన్నారు. మరో 35 వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయబోతున్నామని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో యువత మరింతగా రాణించేందుకు స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. తెలంగాణలో పేదలకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయంలో సచివాలయంలోకి ఎవ్వరిని రానివ్వని పరిస్థితి ఉండేదని, సచివాలయంలోకి వెళ్తే ఆరెస్టులు చేశారని మండిపడ్డారు. అటువంటి పరిస్థితి ఇప్పుడు లేదన్నారు.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి