CM Revanth: లోక్‌సభ తొలి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించిన సీఎం రేవంత్‌ రెడ్డి.. భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపు

|

Feb 21, 2024 | 9:32 PM

త్వరలో జరుగనున్న లోక్ సభ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తొలి అభ్యర్థిని ప్రకటించారు. కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులుకు శంకుస్థాపన చేసిన సీఎం.. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డి పేరును ఖరారు చేశారు.

CM Revanth: లోక్‌సభ తొలి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించిన సీఎం రేవంత్‌ రెడ్డి.. భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపు
Cm Revanth Reddy
Follow us on

త్వరలో జరుగనున్న లోక్ సభ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తొలి అభ్యర్థిని ప్రకటించారు. కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులుకు శంకుస్థాపన చేసిన సీఎం.. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డి పేరును ఖరారు చేశారు. వంశీచంద్ రెడ్డిని 50వేల మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

రాబోయే లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి 14 మంది కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే దేశ స్థాయిలో తెలంగాణ గొప్పతనం తెలుస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇక రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి ఎన్నికల వారం రోజుల్లోనే రూ.500కు గ్యాస్ సింలిండర్ అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో నాలుగు గ్యారెంటీలు అమలు చేసే దిశగా ముందుకెళ్తున్నామన్నారు. 200 యూనిట్ల ఉచిత కరెంట్ త్వరలోనే ఇస్తామని హామీ ఇచ్చారు. రాబోయే కొద్ది రోజుల్లోనే రైతు రుణమాఫీ కూడా చెపడాతామని తెలిపారు. రైతుభరోసాను పది రో జుల్లో అర్హులందరికి వేస్తామని చెప్పారు

ఇక ప్రతిపక్ష పార్టీలపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ బీఆర్‌ఎస్‌ రెండు ఒకటే అన్నారు..కుట్రలతో కాంగ్రెస్‌ని దెబ్బతీయాలని చూస్తున్నాయన్నారని రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌వి చీకటి ఒప్పందాలు త్వరలో బయటపడతాయన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా విషయాన్ని మోదీ మరిచారన్నారు. 27 వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎకరాకు నీళ్లు ఇవ్వలే అని విమర్శించారు. వేల కోట్లు రూపాయలు కాంట్రక్టర్ల దగ్గర నుంచి కమిషన్లుగా తీసుకున్నారని ఆరోపించారు. పదేళ్లలో రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…