CM KCR : గ్రామ మహిళలకు స్వయంగా వంటకాలను వడ్డించిన సీఎం కేసీఆర్, వాసాలమర్రిలో పెద్ద పండుగ శోభ

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి మంగళవారం మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో చేరుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు....

CM KCR : గ్రామ మహిళలకు స్వయంగా వంటకాలను వడ్డించిన సీఎం కేసీఆర్, వాసాలమర్రిలో పెద్ద పండుగ శోభ
Cm Kcr In Vasalamarri

Updated on: Jun 22, 2021 | 4:14 PM

Community Lunch : యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి మంగళవారం మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో చేరుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. తొలుత గ్రామసభ వేదికపైకి వచ్చి అందరికీ అభివాదం చేశారు. ఆ తర్వాత గ్రామస్తులందరితో కలిసి భోజనశాలకు చేరుకున్నారు. అక్కడ టేబుళ్లపై కూర్చున్న గ్రామస్తుల దగ్గరికి వెళ్లి, ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ, భోజనం చేయాల్సిందిగా కోరారు. తమను ముఖ్యమంత్రి స్వయంగా పలకరించడంతో కొందరు గ్రామస్తులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

మరికొందరు తమ సమస్యలను సీఎం కేసీఆర్ కు చెప్పుకున్నారు. ఈ సమస్యలన్నింటినీ నోట్ చేసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. గ్రామస్తులు భోజనం చేస్తున్న సమయంలో చాలాసేపు కలియదిరిగి, వారిని పలకరించిన తర్వాత సీఎం కేసీఆర్ వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. తన పక్కన కూర్చున్న గ్రామ మహిళలకు సీఎం స్వయంగా వంటకాలను వడ్డించారు. అనంతరం వాసాలమర్రిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గ్రామ ప్రజల జీవన విధానం ఎలా ఉండాలి.. తదితర అంశాలపై ప్రజలతో మాట్లాడుతున్నారు .. ఆ లైవ్ ప్రత్యక్ష ప్రసారం..

Read also : Tadepalli : తాడేపల్లి అత్యాచార కేసు : ఫోన్లు తాకట్టు పెట్టుకున్న వ్యక్తి అరెస్ట్, అనుమానితుని ఇంట్లో సోదాలు.. తల్లి ఏమంటోందంటే..