పార్టీ లీడర్లతో విస్తృతస్థాయి సమావేశం. కలెక్టర్లతో సమీక్ష. జిల్లాల పర్యటన. వచ్చే వారం రోజుల్లో తెలంగాణ CM KCR షెడ్యూల్ ఇది. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతోపాటు..పాలనపైనా ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు ముఖ్యమంత్రి. అటు జిల్లాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టించనున్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 29న పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం సెప్టెంబర్ 5న నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌ను, సెప్టెంబర్ 10న జగిత్యాల కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన అనంతరం.. అన్ని జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందుల
ఇప్పటికే పలు జిల్లాల్లో కార్యాలయాలు ప్రజలకు అందుబాటులోకి రాగా.. మరికొన్ని ప్రారంభానికి సిద్ధమయ్యాయి. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అధికారులు చకాచకా ఏర్పాట్లు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం