CM Kcr: నేడు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో పయనం..
CM Kcr: తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేడు సందర్శించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు..
CM Kcr: తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేడు సందర్శించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్ నుంచి కాళేశ్వరానికి బయలుదేరుతారు. అక్కడికి చేరుకున్నాక.. ప్రాజెక్టు సందర్శనకు ముందు కాలేశ్వర ముక్తేశ్వర స్వామి క్షేత్రంలో పూజలు నిర్వహించనున్నారు.
అనంతరం 11.45 గంటలకు మెడిగడ్డ బ్యారేజ్ పరిశీలిస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం ఇరిగేషన్ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌కు తిరుగుపయనం అవుతారు. ఇదిలాఉంటే.. సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటన సందర్శంగా పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనువణువూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
Also read:
Accident in Surat: గుజరాత్‌లోని సూరత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది దుర్మరణం..