CM KCR: ప్లీజ్ బాస్ ఒక్కసారి.. ఆశావహులు, అసంతృప్తుల్లో టెన్షన్‌ టెన్షన్‌.. నేడే BRS తొలి జాబితా విడుదల..

|

Aug 21, 2023 | 10:34 AM

BRS Candidates List: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది.. ఇవాళే.. బీఆర్‌ఎస్‌ బాస్‌ సీఎం కేసీఆర్ నుంచి ఫస్ట్‌ లిస్ట్‌ రిలీజ్ కానుంది. మరి అందులో ఆశావహులకు చోటుందా.. సిట్టింగుల సిచ్యుయేషన్‌ ఏంటి.. అసంతృప్తుల మాటేంటి.. అసలు ఎంతమందిని మారుస్తున్నారు. ఎంతమందికి పట్టం కడుతున్నారు. ఎంతమందిని బుజ్జగిస్తున్నారు.

CM KCR: ప్లీజ్ బాస్ ఒక్కసారి.. ఆశావహులు, అసంతృప్తుల్లో టెన్షన్‌ టెన్షన్‌.. నేడే BRS తొలి జాబితా విడుదల..
CM KCR - BRS Party
Follow us on

BRS Candidates List: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది.. ఇవాళే.. బీఆర్‌ఎస్‌ బాస్‌ సీఎం కేసీఆర్ నుంచి ఫస్ట్‌ లిస్ట్‌ రిలీజ్ కానుంది. మరి అందులో ఆశావహులకు చోటుందా.. సిట్టింగుల సిచ్యుయేషన్‌ ఏంటి.. అసంతృప్తుల మాటేంటి.. అసలు ఎంతమందిని మారుస్తున్నారు. ఎంతమందికి పట్టం కడుతున్నారు. ఎంతమందిని బుజ్జగిస్తున్నారు. అధినేత నిర్ణయంపై అభ్యర్థుల్లో టెన్షన్‌ పీక్స్‌లో ఉంది.. టిక్కెట్‌ డౌటే అన్న మాటకే గుండెల్లో దడ పుట్టి హైదరాబాద్‌కు పరుగులు తీస్తున్న వారికి గులాబీ బాస్‌ ఇస్తున్న హామీ ఏంటి.. చివరి నిమిషం వరకు వాళ్లు చేస్తున్న ప్రయత్నం ఏంటి..? టికెట్ వస్తుందా.. లేదా.. అనేది చర్చనీయాంశంగా మారింది.

ఆశావహులు, అసంతృప్తుల్లో టెన్షన్‌ మొదలైంది. ఫస్ట్‌ లిస్ట్‌లో పేరుందో లేదో.. పెద్దాయన మనసులో మనం ఉన్నామో లేదో.. టిక్కెట్‌ వస్తుందో రాదో.. ఇలాంటి డౌట్లతో ఆశావహులు, అసంతృప్తులు యమా టెన్షన్‌ పడుతున్నారు. కొందరు అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే.. కొందరు లోలోపలే తమకు తామే ధైర్యం చెప్పుకుంటున్నారు. దాదాపు 15 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. జనగామ ఎమ్మెల్యే ముత్తి రెడ్డి సిఎం కేసీఆర్ ను కలిసే ప్రయత్నం చేసినా టైం దొరక్క పోవడంతో కార్యకర్తలతో సమావేశాలు పెట్టుకుంటూ తనకే టిక్కెట్ ఇవ్వాలని రిక్వెస్ట్‌ చేస్తున్నారు. జనగామలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది.. ఇక స్టేషన్ ఘన్పూర్ లో కూడా ఇదే పరిస్థితి.. ఎమ్మెల్సీ కడియం శ్రీహరికు టిక్కెట్ కన్‌ఫామ్‌ అనే సమాచారంతో ఎమ్మెల్యే రాజయ్య టిక్కెట్ కోసం పూజల్లో బిజీ అయ్యారు.

ఎవరో ఒకరికి టిక్కెట్‌ ఇవ్వాలని రిక్వెస్ట్..

అటు, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కూడా టిక్కెట్ పై అనుమానం తో హైద్రాబాద్ చేరుకొని మంత్రి హరీష్ రావు ను కలిసి హామీ తీసుకుని రిటర్న్‌ అయ్యారు.. మరోవైపు ఉప్పల్ లో నిన్న మొన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉన్న ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌.. దోస్త్‌ మేరా దోస్త్‌ అని కలిసిపోయారు. కవితను కలిసి తమ ఇద్దరిలో ఎవరికో ఒకరికి టిక్కెట్‌ ఇవ్వాలని కోరారు.. లక్ష్మారెడ్డికి మాత్రం ఇవ్వొద్దని ఓపెనయ్యారు.. ఇలాంటి సంఘటనలు ఇప్పుడు కోకొల్లలు జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఎదురుచూపులు

ఇక పార్టీలోకి ఏదో కారణంతో వచ్చినోళ్లు.. పార్టీ పెద్దలే పిలిచినోళ్లు.. ఆశావహులు.. చాలామంది కేసీఆర్‌ లిస్ట్‌ గురించి ఆలోచిస్తున్నారు. దుబ్బాక , హుజురాబాద్ మునుగోడు ఉప ఎన్నికల ముందు చాలామందిని బిఆర్ఎస్ లో చేర్చుకున్నారు. అందులో ఒకరిద్దరికి మాత్రమే పదవులు దక్కాయి..మిగతా నేతలంతా పదవుల కోసం చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్నారు.. అవకాశం వచ్చినప్పుడల్లా సీఎం కేసీఆర్ను మంత్రి కేటీఆర్ ను ప్రసన్నం చేసుకుంటున్నారు.. వాళ్లిచ్చిన హామీని గుర్తు చేస్తున్నారు. దుబ్బాక ఓపెనింగ్ ముందు బిజెపి నుంచి రావుల శ్రీధర్ రెడ్డిని చేర్చుకున్నారు. ఆయనకు కార్పొరేషన్ పదవి ఇచ్చారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ముందు చేరిన నేతలకు ఇప్పటికీ భాగ్యం కలగలేదు. సొంత పార్టీకి కరెక్ట్ టైం లో దెబ్బ కొట్టి..అధికారి పార్టీలో చేరి ఏడాదిన్నర కావస్తున్నా.. వాళ్లంతా ఇంకా ఖాళీగానే వున్నారు.

పెద్దిరెడ్డి, మోత్కుపల్లి పరిస్థితి ఏమిటో..?

హుజురాబాద్ ఉప ఎన్నిక ముందు మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఇంకో మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు బిజెపికి హ్యాండిచ్చారు.. కేసీఆర్‌ పంచన చేరారు.. సొంత పార్టీపైనే వీళ్లు విమర్శలు చేస్తూ.. హుజూరాబాద్లో ప్రచారం చేశారు. హుజురాబాద్‌లో బీఆర్ఎస్‌ ఓడిపోవడంతో…వీళ్లకు ఏ పదవీ దక్కలేదు.. ఒక సారి అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న టైంలో సీఎం కేసీఆర్ ను కలవాలని మోత్కుపల్లి, పెద్దిరెడ్డిలు గంటల తరబడి వేచి చూశారు.. అయినా పెద్దాయన అంత టైమ్‌ ఇవ్వలేదు.. చివరి నిమిషంలో ఒక నిమిషం సీఎం కేసీఆర్ కు కనపడేందుకు తహ తహ లాడారు. తమ బాధ చెప్పుకోవాలని ప్రయత్నించినా కుదరక.. నమస్తేతో వెనుదిరిగారు.

మొన్నటి మునుగోడు ఉప ఎన్నిక ముందు చాలామంది నేతలు అధికార పార్టీలో చేరారు..దాసోజు శ్రవణ్.. శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్.. పల్లె రవి గౌడ్ తో సహా పలువురు కారెక్కారు.. ఇందులో ఒకరిద్దరికి ఎమ్మెల్సీ పదవులు మిగతా వారికి కార్పొరేషన్ పదవులు ఇస్తామన్న హామీతో పార్టీ మారినట్లు ప్రచారం జరిగింది. ఇంకా వాళ్లకు ఎలాంటి పదవులు దక్కలేదు.. ఎప్పటికైనా రాకపోతాయా అని ఎదురుచూస్తూనే ఉన్నారు.. కేసీఆర్ దర్శనం కోసం..పడిగాపులు కాస్తూ..అవకాశం కోసం చూస్తున్నారు. అవతల పార్టీ పై దుమ్మెత్తి పోసి..కారెక్కినందుకు.. వారికి వేరే అవకాశం కూడా లేదు. దీంతో తమ టైమ్ ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తున్నారు.

ఎలక్షన్స్ ముందు ఇతర పార్టీల నేతలకు ఏదో ఒక హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకోవడం బిఆర్ఎస్ పార్టీ పెద్దలకు పరిపాటిగా మారిందని చర్చ జరుగుతోంది.. ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ నేతల పరిస్థితి కుడితి లో పడ్డ ఎలుకల్లా తయారవుతుందని ఆశావహులు.. అసంతృప్తులు గుసగుసలాడుకుంటున్నారట. మరి వీళ్లను ఎలా బుజ్జగిస్తారో వేచి చూడాల్సిందే..


మరిన్ని తెలంగాణ వార్తల కోసం..