CM KCR Delhi Tour: తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి బయల్దేరారు. నేడు బేగంపేట విమానాశ్రయం నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి పయనమయ్యారు. 3 రోజులపాటు సీఎం కేసీఆర్(Chief Minister K ChandraShekar Rao) అక్కడే ఉంటారని తెలుస్తోంది. మంగళవారం ఉదయం సీఎం కేసీఆర్.. ఢిల్లీ(Delhi) ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కలుస్తారని తెలుస్తోంది. ఈమేరకు ఆయనతో ఓ సమావేశం కూడా ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత ఢిల్లీ ఎయిమ్స్‌ను సందర్శించి హెల్త్ టెస్టులు చేయించుకోనున్నారు. అయితే, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర చేపట్టేందుకు పూర్తి స్కెచ్‌తో కేసీఆర్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇతర రాష్ట్రాల నేతలతో కీలక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే ఢిల్లీ సీఎంతోనూ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే.. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కలిసిన సంగతి తెలిసిందే. అలాగే సినిమా నటుడు ప్రకాశ్ రాజ్‌ను కూడా కలిశారు. ఈమేరకు భాజపాకు వ్యతిరేకంగా మద్దతు ఇవ్వాలని కోరారు. అలాగే అనేక లోకల్ పార్టీల నాయకులతోనూ పలు దఫాలుగా సమావేశాలు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
కేంద్ర మంత్రులతోనూ సమావేశం..
సీఎం కేసీఆర్ 3 రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులను కలవనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన హామీలతోపాటు పలు సమస్యలు, అలాగే తెలంగాణకు రావాల్సిన నిధులపై మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అవుతారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.
Also Read: ఏపీ స్వచ్ఛ కార్పొరేషన్ సలహాదారు డాక్టర్ జయప్రకాష్‌ను ఘనంగా సత్కరించిన రోటరీ క్లబ్