CM KCR: ప్రజల ప్రాణాల కంటే.. డబ్బు ముఖ్యం కాదు.. అందరికీ వ్యాక్సిన్.. సీఎం కేసీఆర్

|

Apr 24, 2021 | 3:56 PM

Coronavirus Vaccination in Telangana: ప్రజల ప్రాణాల కంటే.. డబ్బు ముఖ్యం కాదని.. తెలంగాణ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఇస్తామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన

CM KCR: ప్రజల ప్రాణాల కంటే.. డబ్బు ముఖ్యం కాదు.. అందరికీ వ్యాక్సిన్.. సీఎం కేసీఆర్
Cm Kcr
Follow us on

Coronavirus Vaccination in Telangana: ప్రజల ప్రాణాల కంటే.. డబ్బు ముఖ్యం కాదని.. తెలంగాణ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఇస్తామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఆదేశాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, వైద్యశాఖ అధికారులకూ ఇచ్చినట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న అందరికీ వాక్సినేషన్ జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సీపీఆర్ఓ శనివారం ప్రకటనను విడుదల చేసింది. రాష్ట్ర జనాభా, ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి అనేక సెక్టార్లలో పనిచేస్తున్న జనాభా కలుపుకొని తెలంగాణ రాష్ట్రంలో సుమారు నాలుగు కోట్లమంది దాకా ప్రజలు వున్నారని.. వీరిలో ఇప్పటికే 35 లక్షల మందికి పైగా వ్యక్తులకు వాక్సినేషన్ పూర్తయిందని కేసీఆర్ తెలిపారు. మిగతా అందరికీ వయసుతో సంబంధం లేకుండా వాక్సినేషన్ ఇవ్వాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అందరికీ వాక్సినేషన్ ఇవ్వడానికి సుమారు 2500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందనీ, ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

ఇప్పటికే భారత్ బయోటెక్ వ్యాక్సిన్‌ను తయారు చేస్తుందని.. రెడ్డీ ల్యాబ్స్‌తో సహా మరికొన్ని సంస్థలు వాక్సిన్ తయారీకి ముందుకు వచ్చాయని తెలిపారు. కావున వాక్సినేషన్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రెండు-మూడు రోజుల్లో తనకు అవసరమైన వైద్య పరీక్షలు జరిగి, పూర్తి స్వస్థత చేకూరిన తరువాత సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి వాక్సినేషన్ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వాక్సినేషన్ కార్యక్రమం పటిష్టంగా, విజయవంతంగా అమలు చేయడానికి జిల్లాలవారీగా ఇన్‌చార్జులను నియమించనున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు.

వాక్సినేషన్‌తోపాటు రెమిడెసివిర్ డ్రగ్స్ కరోనా సంబంధిత మందులకు, ఆక్సిజన్‌కు ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజలు ఏ విధమైన భయభ్రాంతులకు గురికావద్దని, కరోనా సోకినవారికి పడకల విషయంలోనూ, మందుల విషయంలోనూ ప్రభుత్వం చేయాల్సినదంతా చేస్తుందన్నారు. ప్రజలను కోవిడ్ బారి నుండి కాపాడడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. అయితే.. కరోనా నిబంధనల విషయంలో.. పాటించడంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సీఎం ప్రజలకు సూచించారు. పెద్ద ఎత్తున గుంపు-గుంపులుగా కూడవద్దని, ఊరేగింపులలో పాల్గొనవద్దని, అత్యవసరమైతేనే తప్ప బయట తిరగవద్దని, స్వయం క్రమశిక్షణ పాటించాలని ముఖ్యమంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Also Read:

Medical Oxygen Shortage: ఢిల్లీలో దారుణం.. ఆక్సిజన్ కొరతతో మరో 20 మంది బలి.. మరికొంత మంది పరిస్థితి విషమం

Maoist Attacks: హెచ్చరించి మరీ హతమార్చిన మావోయిస్టులు.. 2018 నుంచి ఎన్నో ఘాతుకాలు.. ఎక్కడెక్కడ అంటే..?