CM KCR meets Amit Shah: ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో శనివారం సమావేశమయ్యారు. మూడు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ నిన్న ప్రధాని మోదీని కలిసి పలు విషయాలపై చర్చించిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం కేసీఆర్ అమిత్‌షాను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించి.. పలు విజ్ఞప్తులు చేశారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఐపీఎస్‌ల కేటాయింపుతో పాటు మరికొన్ని అంశాలను కేసీఆర్ ప్రస్తావించారు.
రాష్ట్రంలో నూతన జిల్లాలు, పోలీస్ కమిషనరేట్లు పెరిగిన నేపథ్యంలో ఐపీఎస్ క్యాడర్‌పై సమీక్ష చేయాలని సీఎం కేసీఆర్.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు వినతిపత్రం అందించారు. గతంలో 9 జిల్లా పోలీసు కార్యాలయాలు, 2 పోలీసు కమిషనరేట్లు ఉండేవని, ప్రస్తుతం పాలన సౌలభ్యం కోసం జిల్లాల విభజన జరిగినట్లు వివరించారు. కొత్త 20 జిల్లా పోలీసు కార్యాలయాలు, 9 పోలీసు కమిషనరేట్లు ఏర్పాటు చేసినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఐపీఎస్‌ల సంఖ్య పెంచాలని కోరారు.
2016లో ఐపీఎస్ క్యాడర్ సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో 76 సీనియర్ డ్యూటీ పోస్టులతో కలిపి మొత్తం 139 ఐపీఎస్ పోస్టులను కేంద్ర హోంశాఖ ఆమోదించింది. ప్రస్తుతం కొత్త జిల్లాలు, కొత్త జోన్లు ఏర్పాటవడంతో కొత్తగా 29 సీనియర్ డ్యూటీ పోస్టులతో పాటు మొత్తం 195 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని కేసీఆర్ అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. కొత్తగా 29 సీనియర్ డ్యూటీ పోస్టులతో పాటుగా మొత్తం 195 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వినతిపత్రం అందించారు.
Also Read: