CM KCR: శాలపల్లిలో సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన.. ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా.. దళితబంధు వర్తిస్తుంది..

|

Aug 16, 2021 | 4:48 PM

ఏడాది క్రితమే ఈ పథకాన్ని ప్రారంభించాలని అనుకున్నానని.. కానీ, కోవిడ్ వ్యాప్తి కారణంగా ఏడాది ఆలస్యమైందని సీఎం కేసీఆర్‌ వివరణ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న కుటుంబాలకు కూడా దళితబంధు వర్తింపజేస్తామని శాలపల్లిలో స్పష్టం చేశారు.

CM KCR: శాలపల్లిలో సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన.. ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా.. దళితబంధు  వర్తిస్తుంది..
Ktr Tweet
Follow us on

శాలపల్లిలో ప్రారంభించిన రైతుబంధు అద్భుతమైన ఫలితాలను సాధిస్తోందని సీఎం కేసీఆర్‌ గుర్తు చేశారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న దళితబంధును కూడా ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నామని సీఎం కేసీఆర్‌ అన్నారు. శాలపల్లిలో దళితబంధు పథకాన్ని ముఖ్యమంత్రి KCR లాంఛనంగా ప్రారంభించారు. శాలపల్లిలోని దళిత బంధు ప్రారంభోత్సవ సభకు చేరుకున్న సీఎం KCR.. జై భీమ్‌ అంటూ ప్రసంగాన్ని మొదలు పెట్టారు. CM KCR మాట్లాడుతూ.. దళితబంధు పథకంతో దళితులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ సింహగర్జన కరీంనగర్‌లోనే జరిగిందని గుర్తు చేశారు. మరో అద్భుతమైన కార్యక్రమానికి కరీంనగర్‌లోనే శ్రీకారం చుడుతున్నామని చెప్పారు.

తెలంగాణ సాకారమైనట్లే ఎస్సీల అభివృద్ధి కూడా జరిగి తీరాలన్నారు. దళితబంధు పథకంతో మరో నాలుగేళ్లలో అద్భుత ఫలితాలు వస్తాయన్నారు. ఏడాది క్రితమే ఈ పథకాన్ని ప్రారంభించాలని అనుకున్నానని.. కానీ, కోవిడ్ వ్యాప్తి కారణంగా ఏడాది ఆలస్యమైందని సీఎం కేసీఆర్‌ వివరణ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న కుటుంబాలకు కూడా దళితబంధు వర్తింపజేస్తామని శాలపల్లిలో స్పష్టం చేశారు.

అంతే కాదు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ పథకాన్ని చూసి మిగతా రాష్ట్రాలు మొదలు పెట్టాయని అన్నారు. ఈ పథకం ద్వారా చిత్తశుద్ధి ఉంటే ఎంతటి లక్ష్యమైనా సాధించవచ్చని నిరూపించామని అన్నారు. ఇతర పార్టీలకు రాజకీయం అనేది ఒక క్రీడ… పేదలకు రూపాయి ఇవ్వని పార్టీలు కూడా విమర్శలు చేస్తున్నాయని అన్నారు. దళిత బంధును విజయవంతం చేసే బాధ్యత ఎస్సీ విద్యార్థులపై ఉందన్నారు. నూటికి నూరు శాతం దళితబంధును అమలు చేస్తామని CM KCR పునరుద్ఘాటించారు.

ఇవి కూడా చదవండి: అయ్యో.. విమానం రెక్కలపై నుంచి జారీ పడ్డారు.. ప్రాణాలు కాపాడుకునేందుకు చేసిన చివరి ప్రయత్నం విఫలం..

HURL Recruitment: హిందూస్థాన్‌ ఉర్వరక్‌ అండ్‌ రసాయన్‌ లిమిటెడ్‌లో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. నేడే చివరి తేదీ.