CM KCR BRS Candidates List: బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితా విడుదల.. ఆ ఏడు స్థానాల్లో క్యాండిడేట్స్‌ మార్పు.

| Edited By: Narender Vaitla

Aug 21, 2023 | 4:03 PM

CM KCR BRS Candidates List Live Updates: ఉత్కంఠకు తెర పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. తొలి జాబితాలో భాగంగా ఏకంగా 115 మంది అభ్యర్థులను సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. మెజారిటీ సిట్టింగ్‌ అభ్యర్థులను కొనసాగిస్తుండగా, కొన్ని స్థానాల్లో మాత్రం మార్పులు చేశారు. కొన్ని స్థానాల్లో పార్టీకి ఇష్టం లేకపోయినా అభ్యర్థులను మార్చాల్సి వచ్చిందని సీఎం చెప్పుకొచ్చారు.

CM KCR BRS Candidates List: బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితా విడుదల.. ఆ ఏడు స్థానాల్లో క్యాండిడేట్స్‌ మార్పు.
CM KCR

CM KCR BRS Candidates List: ఉత్కంఠకు తెర పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. తొలి జాబితాలో భాగంగా ఏకంగా 115 మంది అభ్యర్థులను సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. మెజారిటీ సిట్టింగ్‌ అభ్యర్థులను కొనసాగిస్తుండగా, కొన్ని స్థానాల్లో మాత్రం మార్పులు చేశారు. కొన్ని స్థానాల్లో పార్టీకి ఇష్టం లేకపోయినా అభ్యర్థులను మార్చాల్సి వచ్చిందని సీఎం చెప్పుకొచ్చారు. ఇక నర్సాపూర్, జనగాం, గోషామహల్‌, నాంపల్లి అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టారు. త్వరలోనే ఈ స్థానాలకు సంబంధించి ప్రకటన చేయనున్నారు. ఇక కేసీఆర్‌ ఈసారి రెండు చోట్ల నుంచి పోటీ చేయనుండడం విశేషం. గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలోనూ సీఎం ఈసారి బరిలోకి దిగనున్నారు. కామారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే గంపాగోవర్ధన్‌ అభ్యర్థన మేరకే అక్కడి నుంచి పోటీ చేస్తున్నట్లు కేసీఆర్ చెప్పుకొచ్చారు.

ఇక కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే మార్పులు చేశారు. ఇందులో ఉప్పల్‌ సుభాష్‌ రెడ్డి స్థానంలో బండారు లక్ష్మారెడ్డికి, ఖానాపూర్‌లో రేఖా నాయక్‌ స్థానంలో జాన్సన్‌ రాథోడ్‌ నాయక్‌, బోధ్‌లో బాపురావు ప్లేస్‌లో అనిల్‌ జాదవ్‌కు ఇచ్చారు. ఇక వేములవాడలో చెలమనేని స్థానంలో లక్ష్మీనర్సింహరావుకు చోటు ఇచ్చారు. వైరాలో రాముల నాయక్‌ ప్లేస్‌లో మదన్‌ నాయక్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌లో రాజయ్య స్థానంలో కడియం శ్రీహరికి, అసిఫాబాద్‌లో ఆత్రం సక్కు స్థానంలో కొవ్వా లక్ష్మీకి స్థానం కల్పించారు. కోరుట్లలో విద్యా సాగర్‌ రావు స్థానంలో ఆయన కుమారుడు సంజయ్‌కి టికెట్ ఇచ్చారు. అలాగే కంటోన్మెంట్‌ స్థానంలో కూడా సాయన్న కుమార్తె లాస్యకు స్థానం కల్పించారు. ఈ లెక్కన మొత్తం 9 మంది అభ్యర్థులు మారారు. ఇక కామారెడ్డితో కలుపుకుంటే మొత్తం 10 స్థానాలు మారాయి.

బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా..

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 21 Aug 2023 03:49 PM (IST)

    కవిత ట్వీట్‌..

    బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అభ్యర్థులను ప్రకటించడంపై స్పందించారు ఎమ్మెల్సీ కవిత. ట్విట్టర్‌ వేదికగా ట్వీట్‌ చేస్తూ.. ‘మా అధినేత కేసీఆర్‌ 119 స్థానాలకు గానూ 115 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇని కేసీఆర్‌ సాహసోపేతమైన నాయకత్వం, ఇది కేసీఆర్‌ పాలనపై నిదర్శనం’ అని ట్వీట్ చేశారు.

  • 21 Aug 2023 03:14 PM (IST)

    క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..

    అభ్యర్థులను ప్రకటించిన అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్‌ సంచనల వ్యాఖ్యలు చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే పార్టీ నుంచి బయటకు పంపిస్తామని తేల్చి చెప్పారు. 95 నుంచి 105 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన కేసీఆర్‌.. నేతల్లో అసమ్మతి సర్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నేతల విజ్ఞప్తి మేరకే కామారెడ్డిలో పోటీ చేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఎమ్‌ఐఎమ్‌ తమకు మిత్రపక్షమని మరోసారి సీఎం స్పష్టం చేశారు.

  • 21 Aug 2023 03:07 PM (IST)

    పెండింగ్‌లో ఉన్న స్థానాలు ఇవే..

    బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలా జాబితాను ప్రకటించిన సీఎం కేసీఆర్‌ కొన్ని స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. వీటిలో నర్సాపూర్, నాంపల్లి, గోషామహల్‌, జనగాం నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

  • 21 Aug 2023 02:58 PM (IST)

    అభ్యర్థుల జాబితా ఇదే..

    సీఎం కేసీర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అభ్యర్థుల్లో పెద్దగా మార్పు చేయలేదని చెప్పుకొచ్చిన సీఎం కొన్ని అనివార్య కారణాల వల్లే మార్పులు చేశామని చెప్పుకొచ్చారు. సీఎం ప్రకటించిన ఎమ్మెల్యేల జాబితా కోసం క్లిక్‌ చేయండి..

  • 21 Aug 2023 02:50 PM (IST)

    కేసీఆర్‌ ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారంటే..

    అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్న సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేశారు. ఈసారి తాను రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రస్తుతం గజ్వెల్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేసీఆర్‌, ఈసారి కామారెడ్డి నుంచి కూడా పోటీచేయనున్నట్లు ప్రకటించారు.

  • 21 Aug 2023 02:46 PM (IST)

    మార్పులు పెద్దగా లేవు..

    తెలంగాణ భవన్‌ చేరుకున్న సీఎం కేసీఆర్‌ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నారు. ఈసారి కూడా పెద్దగా మార్పులు లేకుండానే ఎన్నికలకు వెళ్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. కొన్ని స్థానాల్లో ఇష్టం లేకపోయినా అభ్యర్థులను మార్చాల్సి వచ్చిందని సీఎం తెలిపారు. వేములవాడలో ఎమ్మెల్యే పౌరసత్వం వివాదం నేపథ్యంలో మార్చాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు.

  • 21 Aug 2023 02:38 PM (IST)

    కాసేపట్లో తెలంగాణ భవన్‌కు కేసీఆర్‌..

    బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించేందుకు గాను సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌ నుంచి బయలుదేరారు. మరికాసేపట్లో తెలంగాణ భవన్‌కు చేరుకోనున్నారు. కేసీఆర్ ఎవరి పేర్లు ప్రకటించనున్నారదానిపై ఉత్కంఠ నెతలకొంది.

  • 21 Aug 2023 02:31 PM (IST)

    వేములవాడ టికెట్ ఎవరికో తెలిసిపోయింది..

    అభ్యర్థుల జాబితాను కాసేపట్లో సీఎం ప్రకటిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్‌ వచ్చింది. చల్మెడ లక్ష్మి నర్సింహారావుకు సీఎం కేసీఆర్‌ ఫోన్‌ చేసినట్లు తెలుస్తోంది. వేములవాడ టికెట్ నీకే అంటూ సీఎం ప్రకటన చేశారని, భారీ మెజారిటీతో విజయం సాధించి రావాలని సీఎం పిలుపినిచ్చినట్లు తెలుస్తోంది

  • 21 Aug 2023 02:31 PM (IST)

    105 మందితో అభ్యర్థుల జాబిక..

    బీఆర్‌ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించనున్నారు సీఎం కేసీఆర్‌. ఇందులో భాగంగా మొత్తం 105 మందితో కూడుకున్న జాబితాను విడుదల చేయనున్నారు సీఎం. పలు సిట్టింగ్స్‌లో మార్పులు జరగనున్నాయన్న ఊహాగానాల నేపథ్యంలో అందిరలోనూ ఆసక్తినెలకొంది. అయితే సీఎం ప్రెస్‌మీట్ కేవలం 7 నిమిషాలు మాత్రమే ఉంటుందని తెలుస్తోంది.

  • 21 Aug 2023 02:15 PM (IST)

    నేతల ఎదురుచూపులు..

    సీఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ కోసం గులాబీ నేతలు, కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాసేపట్లో KCR ప్రకటించనున్న జాబితాలో తమ పేరు ఉంటుందా.. లేదా అని సిట్టింగులు, ఆశావహులు టెన్షన్‌ పడుతున్నారు. కేసీఆర్‌ ఏం చెప్తారు.. ఏఏ నియోజకవర్గాలు పెండింగ్‌ పెడుతారన్న అంశం చర్చనీయాంశంగా మారింది.

  • 21 Aug 2023 02:00 PM (IST)

    కవిత ఇంటికెళ్లింది వీరే..

    మంత్రి KTR ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉండడంతో.. ఉదయం MLC కవిత ఇంటికి క్యూకట్టారు BRS నేతలు. కాసేపట్లో అభ్యర్థుల ప్రకటన ఉండటంతో సిట్టింగులు, ఆశావహుల చివరి ప్రయత్నం చేశారు. ఖానాపూర్‌ MLA రేఖానాయక్‌, సునీతా లక్ష్మారెడ్డి, MLA ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్సీలు ఎల్‌.రమణ, తాతా మధు, మాజీ ఎమ్మెల్యే రత్నం, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌ కుమారుడు కవితను కలిశారు.

  • 21 Aug 2023 01:58 PM (IST)

    జాబితాలో పేరు ఉంటుందా..

    CM KCR ప్రెస్‌మీట్‌ కోసం గులాబీ నేతలు, కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాసేపట్లో KCR ప్రకటించనున్న జాబితాలో తమ పేరు ఉంటుందా.. లేదా అని సిట్టింగులు, ఆశావహులు టెన్షన్‌ పడుతున్నారు. కేసీఆర్‌ ఏం చెప్తారు.. ఏఏ నియోజకవర్గాలు పెండింగ్‌ పెడుతారన్న అంశం చర్చనీయాంశంగా మారింది.

  • 21 Aug 2023 01:48 PM (IST)

    తెలంగాణ భవన్‌లో సందడి

    తెలంగాణ భవన్‌లో సందడి వాతావరణం నెలకొంది. మరికాసేపట్లో కేసీఆర్ తెలంగాణ భవన్ కు రానున్నారు. దీంతో BRS నేతలు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. అన్ని చోట్ల BRS జాబితాపై ఉత్కంఠ కొనసాగుతోంది.

  • 21 Aug 2023 01:41 PM (IST)

    ఉమ్మడి ఖమ్మంలో BRS టిక్కెట్‌ కోసం పోటాపోటీ..

    ఉమ్మడి ఖమ్మంలో BRS టిక్కెట్‌ కోసం పోటాపోటీ నెలకొంది. వైరా టిక్కెట్‌ కోసం నలుగురి మధ్య తీవ్ర పోటీ.. రాములు నాయక్‌, ఆయన కుమారుడు, మదన్‌లాల్, బానోత్‌ చంద్రావతి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇల్లందు టిక్కెట్‌ కోసం హరిప్రియ, గుమ్మడి అనురాధ, కోరం కనకయ్య ప్రయత్నం.. పాలేరులో కందాల ఉపేందర్‌ రెడ్డి, తుమ్మల మధ్య పోటీ.. భద్రాచలంలో తెల్లం వర్సెస్‌ బుచ్చయ్య.. కొత్తగూడెంలో వనమా, జలగం, గడల శ్రీనివాస్‌ రావు మధ్య పోటీ ఉంది. భద్రాచలం BRS పార్టీలో అసమ్మతి మొదలైంది. తెల్లం వెంకట్రావుకు టిక్కెట్‌ ఇవ్వొద్దని నేతలు డిమాండ్ చేస్తున్నారు. తెల్లం వెంకట్రావుకు కాకుండా.. చర్ల మార్కెట్ మాజీ చైర్మన్ బుచ్చయ్యకు టికెట్ ఇవ్వాలని భద్రాచలం BRS నేతలు పువ్వాడ అజయ్‌ని కలిశారు.

  • 21 Aug 2023 01:23 PM (IST)

    ఆత్మాభిమానాలు దెబ్బతింటాయి.. చెన్నమనేని సంచలన పోస్ట్‌..

    కేసీఆర్ టికెట్ల ప్రకటనకు ముందు వేములవాడ MLA చెన్నమనేని రమేష్ ఆసక్తికర పోస్ట్‌ చేశారు.. రాజకీయాలు ప్రజల కోసమే చేయాలి, పదవుల కోసం కాదు అని చెప్పిన మా తండ్రిగారి మాటలను ప్రతిసారి స్మరించుకుంటు ఆపనిని నా తుది శ్వాస ఉన్నంతవరకు చేస్తానని నాతొ ఉన్నవారందరికి భరోసా ఇస్తున్నాను! దయచేసి నిర్ణయాలు మా అందరితో సంప్రదించి మా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తీసుకోవాలి, లేనిపక్షంలో ఆత్మాభిమానాలు దెబ్బతింటాయి, ప్రజల ఆమోదం లభించదు. ఇది మనందరం తెలంగాణ ఉద్యమంలో నేర్చుకున్న మొదటి పాఠం. అంటూ పోస్ట్.. చేశారు.

  • 21 Aug 2023 01:20 PM (IST)

    నిన్నటి వరకు పోరాటం.. ఇవాళ..

    హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనా చారిని మర్యాద పూర్వకంగా కలిశారు భూపాలపల్లి MLA గండ్ర వెంకట రమణా రెడ్డి దంపతులు. నిన్నటి వరకు భూపాలపల్లి BRS టిక్కెట్ కోసం ఇరు వర్గాలు పోరాటం చేశాయి. ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనకు గంట ముందు వీరిద్దరూ కలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

  • 21 Aug 2023 01:12 PM (IST)

    మైనంపల్లి వార్నింగ్

    సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లు ప్రకటనకు ముందు.. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి వాయిస్ పెంచారు. తన కుమారుడికి, తనకు మెదక్, మల్కాజ్‌గిరి టిక్కెట్లు ఇస్తేనే బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేస్తామని మైనంపల్లి ప్రకటించారు. మెదక్‌లో హరీశ్‌రావు నియంతలా వ్యవహరిస్తున్నారని సంచలన కామెంట్స్ చేశారు. హరీశ్‌రావు తన గతం గుర్తుంచుకోవాలని.. సిద్దిపేట వలే మెదక్‌ను ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. టికెట్ ఇవ్వకుంటే సిద్దిపేటలో తన కుమారుడు, మల్కాజ్ గిరిలో తాను పోటీ చేస్తామని.. సిద్ధిపేటలో హరీశ్‌రావు అడ్రస్‌ గల్లంతు చేస్తానని ఆయన వార్నింగ్ ఇచ్చారు.

  • 21 Aug 2023 01:05 PM (IST)

    7 నిమిషాల్లోనే జాబితా విడుదల..!

    కాసేపట్లో తెలంగాణ భవన్‌కు చేరుకోనున్న సీఎం కేసీఆర్‌ మ.2.30గం.లకు బీఆర్‌ఎస్‌ తొలిజాబితా ప్రకటించనున్నారు. జాబితా విడుదల సమయంలో సెంటిమెంట్‌ ఫాలోకానున్నారు. 7 నిమిషాల్లోనే జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. తొలిజాబితా రిలీజ్‌ నేపథ్యంలో ఆశావహుల్లో టెన్షన్‌ నెలకొంది

  • 21 Aug 2023 12:57 PM (IST)

    మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రెస్ మీట్..

    సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 2.30 గంటలకు తెలంగాణ భవన్ కు చేరుకోనున్నారు. ఆ తర్వాత మంత్రులు, నేతలతో కలిసి మీడియాతో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మొదటి జాబితాను విడుదల చేయనున్నారు.

  • 21 Aug 2023 12:49 PM (IST)

    టికెట్ ఇవ్వొద్దంటూ నియోజకవర్గాల్లో ఆందోళనలు

    బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. కొందరికి టికెట్ ఇవ్వొద్దంటూ నియోజకవర్గాల్లో ఆందోళనలు మొదలయ్యాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, మెదక్ జిల్లాల్లో నేతలకు అసమ్మతి సెగ వెంటాడుతోంది. జనగామ, స్టేషన్‌ ఘన్‌పూర్‌, మెదక్, నర్సాపూర్, భద్రాచలం, ఇల్లందు నియోజక వర్గాల్లో నిరసనలు తెలుపుతున్నారు. సిట్టింగ్‌లకు టికెట్ ఇవ్వొదని 6 చోట్ల క్యాడర్ ఆందోళన చేస్తోంది.

Follow us on