PV Jayanthi: 26 అడుగుల పీవీ కాంస్య విగ్ర‌హ ఆవిష్క‌రణ‌.. పీవీ ఒక కీర్తి శిఖ‌రం అంటూ పొగిడిన కేసీఆర్‌..

|

Jun 28, 2021 | 1:57 PM

PV Jayanthi KCR: ఏడాది కాలంగా సాగుతోన్న పీవీ నర్సింహారావు శ‌త జ‌యంతి ఉత్స‌వాలు నేటితో ముగిశాయి. ఈ సంద‌ర్భాన్ని ముగించుకొని హైద‌రాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లో పీవీ మార్గ్‌లో ఉన్న జ్ఞాన భూమిలో శ‌తజ‌యంతి ముగింపు...

PV Jayanthi: 26 అడుగుల పీవీ కాంస్య విగ్ర‌హ ఆవిష్క‌రణ‌.. పీవీ ఒక కీర్తి శిఖ‌రం అంటూ పొగిడిన కేసీఆర్‌..
Pv Shatha Jayanthi Celebrations
Follow us on

PV Jayanthi KCR: ఏడాది కాలంగా సాగుతోన్న పీవీ నర్సింహారావు శ‌త జ‌యంతి ఉత్స‌వాలు నేటితో ముగిశాయి. ఈ సంద‌ర్భాన్ని ముగించుకొని హైద‌రాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లో పీవీ మార్గ్‌లో ఉన్న జ్ఞాన భూమిలో శ‌తజ‌యంతి ముగింపు ఉత్స‌వాల‌ను నిర్వ‌హించారు. వేడుక‌ల్లో భాగంగా 26 అడుగుల పీవీ కాంస్య విగ్రహాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా నెక్లెస్‌రోడ్‌ను పీవీ మార్గ్‌గా ప్ర‌క‌టించారు. అంతేకాకుండా ఈ సంద‌ర్భంగా పీవీ న‌ర్సింహారావు ర‌చ‌న‌ల‌తో రూపొందించిన పుస్త‌కాల‌ను విడుద‌ల చేశారు.

పీవీ కీర్తి శిఖ‌రం: కేసీఆర్‌

విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ చేసిన త‌ర్వాత సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పీవీపై ప్రశంస‌ల వ‌ర్షం కురిపించారు. కాకతీయ వర్సిటీలో పీవీ పీఠం ఏర్పాటు చేయనున్నట్లు ప్ర‌క‌టించారు. ఇక పీవీ గొప్పత‌నం గురించి వివరిస్తూ.. ఆయ‌న బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు అని పొగిడారు. పీవీ జ‌యంతి ఉత్స‌వాల‌ను విజయవంతంగా నిర్వహించిన కేశవరావుకు అభినందనలు తెలిపారు. పీవీని ఎంత గౌరవించుకున్నా తక్కువే అని కేసీఆర్‌ అన్నారు. పీవీ ఒక కీర్తి శిఖ‌ర‌మ‌ని కొనియాడిన సీఎం.. ఆయ‌న హయంలో తీసుకున్న విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాల‌ను గుర్తుచేసుకున్నారు.

ఎంతో సంతోషంగా ఉంది..

పీవీ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌డం ప‌ట్ల త‌నకు ఎంతో సంతోషంగా ఉంద‌ని తెలిపారు గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై. పీవీ శ‌త‌జ‌యంతి అంద‌రికీ గొప్ప పండుగని గ‌వ‌ర్న‌ర్ అన్నారు. ఆయ‌న ర‌చ‌న‌ల‌ను అంద‌రికీ అందుబాటులోకి తీసుకురావ‌డం హ‌ర్ణ‌ణీయ‌న్న గ‌వ‌ర్న‌ర్‌.. పీవీ రాజకీయాలకు అతీతంగా గౌరవించుకోదగిన వ్యక్తి అని కలాం చెప్పేవారని గుర్తు చేశారు.

Also Read: AP Curfew Extended: ఏపీలో కర్ఫ్యూ సడలింపు వేళల్లో మార్పులు.. జూలై 1 నుంచి కొత్త నిబంధనలు వర్తింపు..

Agni P: ‘అగ్ని పీ’ పరీక్ష విజయవంతం; ఈ సిరీస్‌లో అత్యాధునిక క్షిపణిని ప్రయోగించిన డీఆర్‌డీవో

Rave Party Case: రేవ్ పార్టీలో పట్టుబడిన బిగ్‌బాస్ మాజీ పోటీదారు.. భారీగా డ్ర‌గ్స్‌ను స్వాధీనం