Petrol Price: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర రూ. 100 మార్క్‌ను దాటేయగా.. తెలంగాణలో సెంచరీకి చేరువగా ఉంది. అయితే పెరుగుతున్న చమురు ధరలను చూసి సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. స్వంత వాహనాలపై బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. అత్యవసరం అయితే తప్ప వాహనదారులు తమ బళ్లను బయటికి తీయడం లేదు. ఇక కొందరు అయితే అవసరం మేరకు పెట్రోల్ కొట్టించుకుని.. పని పూర్తి చేసుకుంటున్నారు. లీటర్ పెట్రోల్ ధర రూ. 100 ఉంటే.. అందులో సగం కొట్టించుకుంటున్నారు.
ఇదిలాఉంటే.. తాజాగా పెట్రోల్ విషయంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ పెట్రోల్ బంక్‌లో తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. రూ. 50 రూపాయల పెట్రోల్ విషయమైన బంక్ వర్కర్‌పై దాడికి పాల్పడ్డారు. ముగ్గురు యువకులు ఆదివారం నాడు పెట్రోల్ బంక్‌కు వెళ్లారు. డిజిటల్ పేమెంట్ ద్వారా రూ. 50 పెట్రోల్ పోయాలంటూ కోరారు. అయితే. రూ.100 లోపు డిజిటల్ చెల్లింపులకు పెట్రోల్ పోయలేమని పెట్రోల్ బంక్ వర్కర్ వారికి చెప్పాడు. దాంతో వారు.. రూ.100 పెట్రోల్ పోయించుకున్నారు. కానీ, వర్కర్‌కి రూ. 50 మాత్రమే ఇచ్చారు. దాంతో ఆ పెట్రోల్ బంక్ వర్కర్ వారిని నిలదీశాడు. అలా వారి మధ్య చోటు చేసుకున్న ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. చివరికి బైక్‌పై వచ్చిన ముగ్గురు యువకులు పెట్రోల్ బంక్ వర్కర్‌పై పిడిగుద్దులు గుద్దారు. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. పెట్రోల్ బంక్ యజమాని వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Also read:
కన్న కొడుకు కోసం తండ్రి పోరాటం.. మొసలి పొట్ట కోసి బాలుడిని బయటికి తీశాడు.. కానీ.!