Clashes: ఉప్పర్‌పల్లిలో తీవ్ర ఉద్రిక్తత.. ప్రహరీ విషయంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ.. తీవ్రంగా గాయపడిన వ్యక్తి..
Clashes: మేడ్చల్ జిల్లా శామీర్‌పేట పీఎస్ పరిధిలోని ఉప్పర్ పల్లిలో దారుణం వెలుగు చూసింది. ప్రవహరీ విషయంలో జరిగిన గొడవ ఓ వ్యక్తి ప్రాణాల..
Clashes: మేడ్చల్ జిల్లా శామీర్‌పేట పీఎస్ పరిధిలోని ఉప్పర్ పల్లిలో దారుణం వెలుగు చూసింది. ప్రవహరీ విషయంలో జరిగిన గొడవ ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. వివరాల్లోకెళితే.. ఉప్పర్‌పల్లిలో సత్తిరెడ్డి, వీరస్వామి ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. అయితే, వీరి ఇరువురి కుటుంబాల మధ్య తరచుగా వివాదాల జరిగేవి. ఈ నేపథ్యంలోనే ప్రవహరీ విషయంలో తాజాగా మరోసారి ఘర్షణ చోటు చేసుకుంది. అయితే సత్తిరెడ్డి అనే వ్యక్తిపై విరస్వామి, అతని అనుచరులైన కొందరు రౌడీలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సత్తిరెడ్డి తీవ్రంగా గాపడి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దాంతో సత్తిరెడ్డిని నగరంలోని యశోద ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, మరికొన్ని గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచాలని వైద్యులు తెలిపారు. కాగా, ఇతర ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తులు సత్తిరెడ్డిపై దాడి చేయడంతో గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాడి చేసిన దుండగులు భువనగిరికి చెందిన వారు బాధితులు చెబుతున్నారు. వారు గంజాయి సేవించి కర్రలతో సత్తిరెడ్డి, అతని కుటుంబ సభ్యులపై దాడి చేయించారని బాధితులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి.. నిందితులపై కేసు నమోదు చేశారు.
Also read:
Tomato price fall: రైతు నోట మాట రావడం లేదు… భారీగా పడిపోయిన ధర.. కిలో రేటు రెండు రూపాయలే…
సికింద్రాబాద్ రాజరాజేశ్వరి గార్డెన్ లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు