CJI NV Ramana: న్యాయ వ్యవస్థ బలోపేతానికే నిర్ణయాలు.. తెలంగాణ సీఎస్ తీరుపై సీజేఐ ఆగ్రహం..

|

May 01, 2022 | 6:48 AM

CJI NV Ramana Serious on Telangana CS: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని న్యాయవ్యవస్థ

CJI NV Ramana: న్యాయ వ్యవస్థ బలోపేతానికే నిర్ణయాలు.. తెలంగాణ సీఎస్ తీరుపై సీజేఐ ఆగ్రహం..
Cji Nv Ramana
Follow us on

CJI NV Ramana Serious on Telangana CS: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని న్యాయవ్యవస్థ సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి, హైకోర్టు సీజే పలు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, వాటిని సీఎస్ సోమేష్‌కుమార్ అమలు చేయకుండా పెండింగ్‌‌లో ఉంచుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. తాము వ్యక్తిగత పనుల కోసం అడగడం లేదని, న్యాయ వ్యవస్థ బలోపేతం కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణలోని కోర్టుల్లో దయనీయ పరిస్థితులున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు జస్టిస్ ఎన్వీ రమణ. జిల్లా కోర్టుల్లో ఒక న్యాయవాది లోపలికి వెళ్లి వెనక్కి వస్తే తప్ప మరొకరు వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరు తమ విధిని నిర్వర్తించే సమయంలో లక్ష్మణ రేఖను గుర్తుంచుకోవాలని సీజేఐ రమణ సూచించారు.

చట్టానికి అనుగుణంగా ఉంటే పాలనలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోకూడదని చెప్పారు. కోర్టుల ఆదేశాలను కొన్ని ప్రభుత్వాలను పట్టించుకోకపోవడంతో ధిక్కరణ కేసులు పెరుగుతున్నాయని, దేశంలో న్యాయవ్యవస్థ బలోపేతానికి మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు జస్టిస్‌ ఎన్వీ రమణ. కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి కోర్టుల్లో మరింత సిబ్బంది కావాలన్నారు.

ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రులు, హైకోర్టు సీజేల సంయుక్త సదస్సులో జస్టిస్ ఎన్వీ రమణ ఈ కామెంట్స్‌ చేయడం చర్చనీయాంశమైంది. అయితే, సీజేఐ వ్యాఖ్యలపై తెలంగాణ న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ స్పందించారు. ఈ అంశాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Read:

Hanuman Chalisa Row హనుమాన్ చాలీసా ఆందోళనలపై ఎన్సీపీ నేత శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు

PM Narendra Modi: ఈ ఏడాది తొలి విదేశీ పర్యటనకు సిద్ధమైన ప్రధాని మోదీ.. 3 రోజుల్లో 3 దేశాలు, 25 సమావేశాల్లో ఫుల్ బిజీ..