Yadagirigutta: యాదగిరిగుట్టలో అన్యమత ప్రచారం.. ఓ ఇంట్లో మతం మారాలంటూ పార్ధనలు.. వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ నిరసన

|

Nov 27, 2022 | 7:32 AM

ఈ అన్యమత ప్రచారాన్ని నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌దళ్‌ ఆద్వర్యంలో పట్ణణంలో భారీ ర్యాలీ తీశారు. యాదాద్రి ఆలయానికి చుట్టూ 5 కిలోమీటర్ల దూరంలో అన్యమత ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను, ఆలయ అధికారులను డిమాండ్‌ చేస్తున్నారు

Yadagirigutta: యాదగిరిగుట్టలో అన్యమత ప్రచారం.. ఓ ఇంట్లో మతం మారాలంటూ పార్ధనలు.. వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ నిరసన
Yadagiri Gutta
Follow us on

యాదగిరి గుట్టలో.. కొండ మీదనే దేవుడు, కొండ కింద దేవుడు కాదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు అన్యమత ప్రచారం చేసే కొందరు ఈ వ్యవహారం పై పెద్ద దుమారమే రేగుతోంది. ప్రశాంతంగా ఉన్న చెరువులో రాయి విసిరినట్టుగా చేస్తున్నారు అన్యమత ప్రచారకులు. టెంపుల్స్‌ ఉన్న ప్రదేశంలో అన్యమత ప్రచారం చేయొద్దు అనే నిబంధనలు ఉన్నా, వాటిని తుంగలో తొక్కేస్తున్నారు. తాజాగా లక్ష్మి నరసింహ స్వామి కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం  యాదగిరిగుట్టలో అన్యమత ప్రచారం చేశారు. ఓ ఇంట్లో గ్రూపుగా మీటింగ్‌ పెట్టుకొని సుమారు ఓ 50 మంది అన్యమత ప్రార్థనలు చేశారు మూడు రోజుల కింత నుంచి మతం మారాలని ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం తెలిసి అక్కడికి వెళ్లిన స్థానిక యువకులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఎంట్రీతో వివాదం సద్దుమణిగింది. ఈ అన్యమత ప్రచారాన్ని నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌దళ్‌ ఆద్వర్యంలో పట్ణణంలో భారీ ర్యాలీ తీశారు. యాదాద్రి ఆలయానికి చుట్టూ 5 కిలోమీటర్ల దూరంలో అన్యమత ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను, ఆలయ అధికారులను డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఈ అన్యమత ప్రచారాన్ని అడ్డుకున్న నేపథ్యంలో తమపైనే పోలీసులు కేసులు నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వీహెచ్‌పీ, బజ్‌రంగ్‌దళ నాయకులు ఆరోపిస్తున్నారు.  కోర్కెలు తీర్చే కోవెల యాదగిరిగుట్టలో ఇలా అన్యమత ప్రచారంపై భక్తులు సైతం మండిపడుతున్నారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..