AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: వీళ్లంతా అమాయకులు అనుకుంటే పొరబడినట్లే.. యమ డేంజర్..

ముఠాలోని నిందితులంతా దాదాపు మహిళలే. అందరూ ఏదో ఒక పనిచేసుకుంటూనే.. పిల్లల అక్రమ రవాణా చేస్తుంటారు. ఈ ముఠాలోని ఒక్కొక్కరు ఒక్కో పనిచేస్తారు. వ్యాపారం పేరుతో ఊరూరా తిరుగుతూ పిల్లలు లేని తల్లిదండ్రుల వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత వాళ్లకు వలేసి.. పిల్లలను విక్రయిస్తారు..

Watch Video: వీళ్లంతా అమాయకులు అనుకుంటే పొరబడినట్లే.. యమ డేంజర్..
Crime News
M Revan Reddy
| Edited By: |

Updated on: May 29, 2025 | 1:56 PM

Share

ముఠాలోని నిందితులంతా దాదాపు మహిళలే. అందరూ ఏదో ఒక పనిచేసుకుంటూనే.. పిల్లల అక్రమ రవాణా చేస్తుంటారు. ఈ ముఠాలోని ఒక్కొక్కరు ఒక్కో పనిచేస్తారు. వ్యాపారం పేరుతో ఊరూరా తిరుగుతూ పిల్లలు లేని తల్లిదండ్రుల వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత వాళ్లకు వలేసి.. పిల్లలను విక్రయిస్తారు.. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కేంద్రంగా శిశు విక్రయ ముఠా గుట్టురట్టయ్యింది. 13మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల్లో ఎక్కువమంది మహిళలే ఉన్నారు. నిందితుల నుంచి ఏడుగురు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలను రక్షించారు. మూడేళ్లలో 28మంది పిల్లలను అక్రమంగా రవాణాచేసి విక్రయించినట్టు గుర్తించారు. మహారాష్ట్ర, గుజరాత్‌లో తక్కువ ధరకు కొనుగోలుచేసి తెలుగు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పిల్లలు లేని తల్లిదండ్రులకు రూ.10లక్షలకు విక్రయించినట్టు గుర్తించారు.

శిశువుల అక్రమ దత్తత.. విక్రయ ముఠాపై పక్కా సమాచారం రావడంతో టేకుమట్లలో అంజయ్య, నాగయ్య దంపతులను అరెస్ట్‌ చేశారు పోలీసులు. వాళ్లను విచారిస్తే.. డొంక మొత్తం కదిలింది. వాళ్లిచ్చిన సమాచారం ఆధారంగా సూర్యాపేటలో నక్క యాదగిరి, ఉమారాణి దంపతులను అరెస్ట్‌ చేశారు. వీళ్లిచ్చిన సమాచారం ఆధారంగా సూర్యాపేట బస్టాండ్‌లో మరికొందర్ని అరెస్ట్‌ చేశారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.

వీడియో చూడండి..

నిందితుల్లో ఎక్కువమంది హైదరాబాద్‌, విజయవాడ, నాగర్‌కర్నూల్‌ వాసులు ఉన్నారంటున్నారు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ.. శిశువుల అక్రమ రవాణా వ్యాపారంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.. దీని వెనుక ఎవరున్నా విడిచిపెట్టమని పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..