
చిన్నారులకు సంబంధించిన అభ్యంతరకర వీడియోలను అప్లోడ్ చేసినా, ఆన్లైన్లో వాటి కోసం బ్రౌజ్ చేసినా సరే చట్టరీత్య శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటీవల కాలంలో అమెరికన్ టిప్ లైన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. వీరంతా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉంటూ ఆన్లైన్‌లో చిన్నారులకు సంబంధించిన అభ్యంతకర వీడియోలను డౌన్లోడ్ చేసుకొని వాటిని ఇతరులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉన్నారు. అలా ఫార్వర్డ్ చేసిన వీడియోల ఐపీ అడ్రస్‌లను పోలీసులు గుర్తించి 15 మందిని అరెస్టు చేశారు.
అయితే చిన్నారుల అభ్యంతకర వీడియోలను అప్లోడ్ చేయడమే కాదు వీటిని బ్రౌజ్ చేసినా సరే శిక్షణ ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చిన్నారులకు సంబంధించిన ఇలాంటి వ్యవహారాల్లో అమెరికన్ ఏజెన్సీలు టిప్ లైన్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. ఫేస్‌బుక్, టెలిగ్రామ్‌తో పాటు ఇతర సోషల్ మీడియాలతో అనుసంధానం చేసుకొని ఈ టిప్ లైన్‌లు పనిచేస్తున్నాయి. ఎవరైనా సరే చిన్నారులకు సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేస్తే వెంటనే ఆ సమాచారాన్ని టిప్ లైన్‌కు అందిస్తాయి.
అమెరికాలో ఉన్న టిప్ లైన్‌ల నుంచి ఇండియాలో ఉన్న ఎన్సీఆర్బికి సమాచారం అందిస్తారు. ఎన్సీఆర్బి నుంచి ఆయా రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులకు ఇలా వీడియోలు అప్లోడ్ చేసిన లేదా ఫార్వర్డ్ చేసిన వారి ఐపి అడ్రస్‌లను అందిస్తారు. ఈ ఐపీ అడ్రస్‌ల ద్వారా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు 15 మందిని అరెస్టు చేశారు.
అరెస్ట్ అయిన ఈ 15 మందిలో ఐఐటీ స్టూడెంట్ తో పాటు బీటెక్ చదివే విద్యార్థి కూడా ఉన్నారు. అయితే మీరు వీడియోలను అప్లోడ్ చేసి ఆర్థిక లబ్ధి పొందుతున్నారా లేదా అనే విషయంపై త్వరలోనే అధికారులకు స్పష్టత రానుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..