
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. నేడు ( బుధవారం ) కొండగట్టులో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు ప్రగతిభవన్ నుంచి భవన్ నుంచి బయలుదేరనున్న సీఎం.. 9.05 కి బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 9.10కి హెలికాఫ్టర్ లో బయలుదేరి 9.40కి కొండగట్టు చేరుకుంటారు. అక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం ఆలయ అభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చిస్తారు. ఒంటి గంటకు తిరుగుపయనమవుతారు. ఈ మేరకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ భాస్కర్ భద్రత బలగాలు హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కొండగట్టుకు వచ్చే వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేశారు.
కాగా.. కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్.. రూ.100 కోట్లు ప్రకటించారు. 418 ఎకరాల భూమిని కేటాయించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం అన్ని సదుపాయాలతో ఆలయాన్ని అత్యంత వైభవంగా నిర్మించనున్నారు. బుధవారం కొండగట్టులో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఆలయం వద్ద ఏర్పాట్లను కలెక్టర్ యాస్మిన్ బాషా, రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్, ఎస్పీ భాస్కర్‌తో కలిసి సోమవారం పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.
మరోవైపు.. కొండగట్టులో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కారణంగా మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులకు తాత్కాలికంగా దర్శనాలను నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. భక్తులు సహకరించాలని కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం