Chicken Price Today: మాంసం ప్రియులకు నోరూరించే వార్త.. భారీగా తగ్గిన చికెన్‌ ధరలు! ప్రస్తుతం కిలో ఎంతంటే..

Chicken Price Drop: తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కిలో చికెన్‌ ధర రూ.380 నుంచి రూ.400 వరకు పలుకుతుంది. దీంతో పెరిగిన ధరలతో పోటీపడలేక జనాలు కోడి గుడ్డుతో సరిపెట్టుకుంటున్నారు. మరోవైపు అమ్మకాలు తగ్గడంతో వ్యాపారులు సైతం గిరాకీలేక డీలీపడిపోయారు. అయితే ఈ రోజు ఆదివారం కావడంతో..

Chicken Price Today: మాంసం ప్రియులకు నోరూరించే వార్త.. భారీగా తగ్గిన చికెన్‌ ధరలు! ప్రస్తుతం కిలో ఎంతంటే..
Chicken Prices In Telangana

Updated on: Mar 29, 2026 | 11:03 AM

హైదరాబాద్, మార్చి 29: గత నెల రోజులుగా చికెన్‌ ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కిలో చికెన్‌ ధర రూ.380 నుంచి రూ.400 వరకు పలుకుతుంది. దీంతో పెరిగిన ధరలతో పోటీపడలేక జనాలు కోడి గుడ్డుతో సరిపెట్టుకుంటున్నారు. మరోవైపు అమ్మకాలు తగ్గడంతో వ్యాపారులు సైతం గిరాకీలేక డీలీపడిపోయారు. అయితే ఈ రోజు ఆదివారం కావడంతో చికెన్ షాపులన్నీ కిటకిటలాడుతున్నాయి. అందుకు కారణం.. నేటి చికెన్‌ ధరలు అమాంతం దిగిరావడమే. ఏకంగా రూ.100 తగ్గడంతో మళ్లీ అమ్మకాలు ఊపందుకున్నాయి.

ఈ రోజు హైదరాబాద్‌లో కిలో చికెన్‌ ధర రూ.270 పలుకుతుంది. అటు వరంగల్‌, రంగారెడ్డి, నారాయణపేట వంటి పలు జిల్లాల్లోనూ చికెన్‌ ధరలు భారీగా దిగివచ్చాయి. స్కిన్డ్ చికెన్‌ రూ.235 నుంచి రూ.240 వరకు, ఇక స్కిన్ లెస్ చికెన్‌ రూ.267 నుంచి 280 మధ్య కొనసాగుతున్నాయి. ఉష్ణోగ్రతలలో హెచ్చుతగ్గుల కారణంగా ఇలా చికెన్ ధరల్లో వ్యత్యాసాలు వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం వాతావరణం చల్లబడటంతో చికెన్ ధరలు తగ్గాయని, దీంతో మళ్లీ అమ్మకాలు పెరిగే అవకాశాలు ఉంటాయని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏపీలో మాత్రం కిలో చికెన్‌ రూ.300 నుంచి 350 మధ్య పలుకుతోంది. ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు, కోళ్ల పెంపకం, లభ్యతను బట్టి ధరలు మారుతుంటాయని వ్యాపారులు తెలిపారు.

వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మారుతున్న వాతావరణం కోళ్ల ఉత్పత్తిని దెబ్బతీశాయని, కోళ్లు వేడిని తట్టుకోలేక వ్యాధులకు గురవుతున్నాయని పరిశ్రమ ప్రతినిధులు తెలిపారు. వేసవిలో కోళ్లు తక్కువ ధాన్యం తిని, ఎక్కువ నీళ్లు తాగడం వల్ల వాటి బరువు సుమారు 1.5 కిలోలు ఉంటుంది. ఉదయం వేడి, సాయంత్రం చల్లగా ఉండటం కారణంగా కోళ్లు మరింతగా మరణిస్తున్నట్లు, దీంతో రైతులు ఉత్పత్తిని తగ్గించవలసి వస్తోందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా కిలో చికెన్ ధర రూ.170 నుంచి రూ.220 మధ్య ఉంటుంది. శ్రావణ, కార్తీక మాసాలలో ఇంకా తక్కువగా ఉంటుంది. కానీ గత రెండు నెలల్లో ఏకంగా కిలో రూ.400 ఆల్ టైం రికార్డు ధర పలికింది. ఇప్పటికే గ్యాస్ ధరలు పెరిగి సామాన్యులపై భారం పడింది. ఇప్పుడు చికెన్ ధరలు కూడా చుక్కలు చూపుతున్నాయని జనాలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఆదివారం చికెన్‌ ధర కాస్త దిగిరావడంతో మాంసం ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పశ్చిమ ఆసియా దేశాల్లో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా గల్ఫ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో గుడ్డు ధర రూ.4కి పడిపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us