Telangana Rains: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. పిడుగులాంటి వార్త చెప్పిన వాతావరణ శాఖ..!

Telangana Rains: అకాల వర్షాలు ఇప్పటికే రైతులను ఆగమాగం చేశాయి. అన్నదాతలు ఇంకా తేరుకోక ముందే, మరో పిడుగు లాంటి వార్త చెప్పింది ఐఎండీ.

Telangana Rains: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. పిడుగులాంటి వార్త చెప్పిన వాతావరణ శాఖ..!
Rain Alert

Updated on: May 18, 2022 | 10:05 AM

Telangana Rains: అకాల వర్షాలు ఇప్పటికే రైతులను ఆగమాగం చేశాయి. అన్నదాతలు ఇంకా తేరుకోక ముందే, మరో పిడుగు లాంటి వార్త చెప్పింది ఐఎండీ. నైరుతి రుతుపవనాల ప్రభావంతో, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. ఈనెల 21 వరకు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇవాళ చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు వాతావరణశాఖ అధికారులు. అటు గంటకు 40 కిలోమీర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు.

అయితే, తెలంగాణలో వరి కోతలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ టైంలో వర్షాలు కురిస్తే, నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. దేశంలోకి ఇప్పటికే నైరుతి రుతుపవనాలు రావడంతో ఆ ప్రభావం రాష్ట్రంపై ఉంటుందని అంచనా వేస్తున్నారు ఐఎండీ ఆఫీసర్లు. అండోమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో మరింత చురుకుగా కదులుతున్నాయని, అండోమాన్‌ దీవులకు పూర్తిగా రుతువపనాలు విస్తరించాయని చెబుతున్నారు. నాలుగైదు రోజుల్లో అండోమాన్‌ నికోబార్‌ దీవులు, కేరళ, దక్షిణ కర్నాటక తీరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. నైరుతి రుతుపవనాల రాకతో అండోమాన్‌ నికోబార్‌ దీవులు సహా చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రానున్న రెండు, మూడు రోజుల్లో బంగాళాఖాతం దక్షిణ ప్రాంతాలకు, అండమాన్‌ సముద్రం, అండమాన్‌ దీవులు మొత్తానికి, బంగాళాఖాతం తూర్పు మధ్య ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు, పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు ఐఎండీ అధికారులు.

Follow Us