Telangana: గ్రూప్-1కు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ఇదే.. పూర్తి వివరాలు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలో జనరల్ ర్యాంకింగ్ లిస్టు ఆధారంగా అవసరమైన అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు పిలిచింది. 563 పోస్టుల భర్తీ కోసం 563 మంది అభ్యర్థులను ప్రొవిజనల్‌గా వెరిఫికేషన్‌కు ఆహ్వానిస్తూ వారి హాల్ టికెట్ల నెంబర్లను..

Telangana: గ్రూప్-1కు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ఇదే.. పూర్తి వివరాలు
రాష్ట్రంలోని 1025 డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు 4,57,000 సీట్లు భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. బిఎ, బిఎస్సి , బీకాం, బిబిఏ, బిసిఎ బిబిఎం కోర్సుల్లో చేరడానికి ఈ దోస్త్ అడ్మిషన్స్ ఉపయోగపడనున్నాయి. మూడు దశల్లో డిగ్రీ అడ్మిషన్స్ ను నిర్వహించినట్లు హైడ్యుకేషన్ తెలిపింది ఫేస్ వన్ ఫేస్ టు ఫేస్ త్రి లకు సంబంధించిన వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి

Edited By: Ravi Kiran

Updated on: Apr 09, 2025 | 9:16 PM

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలో జనరల్ ర్యాంకింగ్ లిస్టు ఆధారంగా అవసరమైన అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు పిలిచింది. 563 పోస్టుల భర్తీ కోసం 563 మంది అభ్యర్థులను ప్రొవిజనల్‌గా వెరిఫికేషన్‌కు ఆహ్వానిస్తూ వారి హాల్ టికెట్ల నెంబర్లను టీజీపీఎస్సీ వెబ్ సైట్ లో పొందుపరించింది. ఏప్రిల్ 16, 17, 19,21 తేదీల్లో అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికెషన్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో చేయనున్నారు. సర్టిపికెట్ వెరిఫికేషన్ కు వచ్చే ముందే అభ్యర్థులు ఆన్ లైన్ లో వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోని రావాలని టీజీపీఎస్సీ సూచించింది. ఈ నెల 15 నుంచి 22 వరకు ఆన్ లైన్ లో వెబ్ ఆప్షన్ అవకాశం కల్పించనట్లు టీజీపీఎస్సీ ప్రకటనలో వెల్లడించింది.

అనివార్య కారణాల వల్ల హాజరుకాలేకపోయిన అభ్యర్థులు, లేదా మిస్ అయిన సర్టిఫికెట్లు సబ్మిట్ చేసేందుకు ఏప్రిల్ 22న రిజర్వ్ డే గా సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగనుంది. ఆ తర్వాత ఎట్టిపరిస్థితుల్లో ఎవరిని అనుమతించే అవకాశం లేదని స్పష్టం చేసింది. డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్, డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ జైల్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ పోస్టులకు వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న అభ్యర్థులను మెడికల్ టెస్ట్ లకు పంపించనున్నట్లు తెలిపారు. ఒరిజినల్ డాంక్యూమెంట్స్ తో పాటు తీసుకురావాల్సిన పత్రాల వివరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను టీజీపీఎస్సీ వెబ్ సైట్ లో పొందుపరిచారు.