Huzurabad By Poll: హుజురాబాద్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ను ఓడించేందుకే TRS నేతలు పూర్తిగా అధికార దుర్వినియోగం చేస్తున్నారని కేంద్ర టూరిజం మంత్రి కిషన్ రెడ్డి టీవీ9 తో అన్నారు. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వారికి కూడా కనీస గుర్తింపు లేదని ఆయన పేర్కొన్నారు. “ఇంతటి అధికార దుర్వినియోగాన్ని నేను నా రాజకీయ జీవితంలో చూడలేదు.. ఈటెలను ఓడించడానికి వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు.. బీజేపీకి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ.. కాంగ్రెస్‌తో లోపాయకార ఒప్పందం అనేది కలలో కూడా ఉండదు.” అని కిషన్ రెడ్డి అన్నారు.
అలాంటి లోపాయకార ఒప్పందాలు, సంకుచిత రాజకీయాలు కేవలంTRS పార్టీకి మాత్రమే స్వంతమని కేంద్రమంత్రి ఎద్దేవా చేశారు. మూకుమ్మడిగా కాంగ్రెస్ నేతలను ఆ పార్టీలో చేర్చుకున్న చరిత్ర TRSది అని కిషన్ రెడ్డి విమర్శించారు. “గ్యాస్ ధరల పెంపు అనేది కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండదు.. ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్ ధరల హెచ్చు తగ్గులను బట్టి గ్యాస్ ధరలు పెరుగుతాయి. ప్రజలపై భారం పడకుండా ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని కిషన్ రెడ్డి వరంగల్ లో టీవీ9తో మాట్లాడుతూ వివరించారు.
Read also: Samantha: సమంత పరువు నష్టం కేసులో ఏం తీర్పు రాబోతోంది? మరికాసేపట్లో..