గల్లీ నుంచి గ్లోబల్ దాకా తెలంగాణ బోనం

బోనాలంటేనే... నాన్ స్టాప్ మ్యూజిక్..పూనకాలు లోడింగ్. ఇక.. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల్లో అయితే వేరే లెవల్. ఆషాఢ మాస బోనాలకు హైదరాబాద్ టు సికింద్రాబాద్ ఊగిపోవాల్సిందే. జూలై 7న ఆదివారం గోల్కొండ కోటపై కొలువుదీరిన శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి మొదటి బోనంతో ఉత్సవాలు షురూ అయ్యాయి. ఆ తర్వాత సికింద్రాబాద్, లాల్ దర్వాజ బోనాల జాతరతో ముగుస్తాయి.

గల్లీ నుంచి గ్లోబల్ దాకా తెలంగాణ బోనం
Telangana Bonalu

Edited By:

Updated on: Jul 14, 2024 | 11:26 AM

కత్తులు బల్లెం చేతబట్టీ.. దుష్టుల తలలు మాలగట్టీ.. నువ్వు పెద్దపులి.. నువ్వు పెద్దపులినెక్కి రావమ్మో గండి పేట గండి మైసమ్మా! అంటూ ఆషాఢం నుంచి శ్రావణం వరకు దాదాపు నెల రోజుల పాటు తెలంగాణలోని పట్నం, పల్లెలు మారుమోగుతాయి. ఆషాఢం అంటేనే బోనాలు.. బోనాలు అంటేనే ఆషాఢం. ఆషాఢ మాసానికి తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయలకు విడదీయరాని అనుబంధం శతాబ్దాలుగా పెనవేసుకుని విరాజిల్లుతుంది. సంవత్సరమంతా వచ్చే పండగలు ఒక ఎత్తయితే, ఆషాడమాసంలో జరుపుకునే బోనాల పండుగ మరో ఎత్తు. ఆట పాటలు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలతో ఊరువాడ ఎకమౌవుతుంది. మారిన పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ బోనం ఖండాంతరాలు దాటి ప్రపంచవ్యాప్తంగా దేదీప్యమానంగా వెలుగొందుతుంది. బోనాలంటేనే… నాన్ స్టాప్ మ్యూజిక్..పూనకాలు లోడింగ్. ఇక.. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల్లో అయితే వేరే లెవల్. ఆషాఢ మాస బోనాలకు హైదరాబాద్ టు సికింద్రాబాద్ ఊగిపోవాల్సిందే. జూలై 7న ఆదివారం గోల్కొండ కోటపై కొలువుదీరిన శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి మొదటి బోనంతో ఉత్సవాలు షురూ అయ్యాయి. ఆ తర్వాత సికింద్రాబాద్, లాల్ దర్వాజ బోనాల జాతరతో ముగుస్తాయి. ఈ నెల రోజుల పాటు నగరం బోనమెత్తుతుంది. గల్లీలు, కాలనీలు, ఉన్నవాళ్లు, లేనివాళ్లు అనే తేడా లేకుండా అన్ని దారులు అమ్మ వైపే. అందరి కోరికా ఒక్కటే.. అందరి మొక్కూ ఒక్కటే.. మా పిల్లా పాపలను చల్లంగా చూడు తల్లీ.. మళ్లొచ్చే బోనాలకు బంగారు బోనం సమర్పిస్తా అని. అమ్మవారికి...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి