
ఇటీవల ఒడిశా రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా కలచివేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై ప్రస్తుతం సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో బాలోసోర్‌లోని సోరో సెక్షన్ సిగ్నల్ జూనియర్ ఇంజినీర్ ఇంటికి సూలు వేశారు. అయితే ఇంతకుముందే ప్రాథమిక విచారణలో భాగంగా సోరో సెక్షన్ సిగ్నల్ జూనియర్ ఇంజినీర్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఇప్పుడు మరింత సమాచారం కోసం మళ్లీ బాలాసోర్ వెళ్లారు. అక్కడ ఉండే ఈ జూనియర్ ఇంజనీర్‌ను ప్రశ్నించేందుకు వెళ్లారు. కాని అతను కనిపించలేదు. కుటుంబ సభ్యులతో సహా కనపడకుండా పోయినట్లు తెలిసింది. దీంతో అధికారులు అతను ఉంటున్న ఇంటిని సీజ్ చేశారు.
మరో విషయం ఏంటంటే రైలు కార్యకలాపాలకు సంబంధించి సిగ్నల్ ఇంజనీర్‌గా పని చేసే వాళ్ల పాత్రే కీలకం. సిగ్నల్, ఇంటర్‌లాకింగ్ సిస్టమ్స్‌తో పాటు పలు వ్యవస్థల నిర్వహణ వీళ్ల పర్యవేక్షణలోనే ఉంటుంది. అందుకే సీబీఐ అధికారులు జూనియర్ ఇంజనీర్‌పై కూడా విచారణ చేపట్టారు. అయితే అతను కుటుంబంతో సహా ఎందుకు కనిపించకుండా వెళ్లిపోయారనే విషయంపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..