నగరంలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. యువతిపై అతికిరాతకంగా దాడి..

| Edited By: Srikar T

Jun 18, 2024 | 8:31 PM

పాతబస్తీలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తనను ప్రేమించడం లేదని వివాహనికి నిరాకరిస్తుందని ఓ యువతిపై కక్ష పెంచుకుని కత్తి, స్క్రూ డ్రైవర్‎తో దాడి చేశాడు. మరో గంటలో ఉద్యోగానికి వెళ్ళాల్సిన యువతి ప్రేమోన్మది దాడితో తీవ్ర గాయలపాలైంది. తనపై దాడి చేస్తున్న క్రమంలో యువతీ కేకలు వేయడంతో స్థానికులు ఆమెను రక్షించారు. ఈ దారుణ ఘటన పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్‎కు కూత వేటులో చోటుచేసుకుంది. హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. శ్రావ్య అనే యువతిపై ప్రేమాన్మాది మణికంఠ దాడికి పాల్పడ్డాడు.

నగరంలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. యువతిపై అతికిరాతకంగా దాడి..
Hyderabad
Follow us on

పాతబస్తీలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తనను ప్రేమించడం లేదని వివాహనికి నిరాకరిస్తుందని ఓ యువతిపై కక్ష పెంచుకుని కత్తి, స్క్రూ డ్రైవర్‎తో దాడి చేశాడు. మరో గంటలో ఉద్యోగానికి వెళ్ళాల్సిన యువతి ప్రేమోన్మది దాడితో తీవ్ర గాయలపాలైంది. తనపై దాడి చేస్తున్న క్రమంలో యువతీ కేకలు వేయడంతో స్థానికులు ఆమెను రక్షించారు. ఈ దారుణ ఘటన పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్‎కు కూత వేటులో చోటుచేసుకుంది. హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. శ్రావ్య అనే యువతిపై ప్రేమాన్మాది మణికంఠ దాడికి పాల్పడ్డాడు. కత్తితో స్క్రూ డ్రైవర్‎తో ఛాతీ, తల, మెడ భాగంలో విచక్షణారహితంగా పొడవటంతో యువతి తీవ్రంగా గాయపడింది. ఉదయం 9 గంటలకు ఛత్రినాక ఎస్ఆర్‎టి కాలనీలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

వరంగల్ జిల్లా చెందిన శ్రావ్య కొన్నేళ్ల క్రితం పాతబస్తీ ఛత్రినాకకు వచ్చి తల్లితో నివాసం ఉంటుంది. శ్రావ్యకు గతంలో ఓ వ్యక్తితో వివాహం అయింది. అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావటంతో విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఇదిలా ఉండగా పాతబస్తీ గౌలిపురకు చెందిన మణికంఠ, శ్రావ్యలు చిన్ననాటి నుంచి స్నేహితులు. విరు దూర బంధువులు కూడా అవుతారు. గతంలోనూ శ్రావ్య ఇంటికి మణికంఠ వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో శ్రావ్యను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు. పెళ్లి ప్రస్తావన సైతం చెప్పి శ్రావ్య‎కు మణికంఠ ప్రపోజ్ చేశాడు. విడాకుల అంశం కోర్టులో ఉండటం వల్ల కొద్ది రోజుకు ఆగాలి అంటూ చెప్పింది. అయితే ఈ మధ్య కాలంలో శ్రావ్య.. మణికంఠను దూరం పెట్టింది.

ప్రేమ వ్యవహారం నడుపుతుందన్న అనుమానం పెంచుకున్న మణికంఠ ఆమెపై కక్ష పెంచుకుని దాడికి తెగబడ్డారు. జూన్ 18న ఉదయం 9 గంటలకు నేరుగా శ్రావ్య ఇంటికి వెళ్ళాడు. ఇంట్లోకి రాగానే గడియ పెట్టాడు. తల్లిలేని సమయంలో ఆమెతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో ఇంట్లోని కత్తి, స్క్రూ డ్రైవర్‎తో శ్రావ్యపై దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. శ్రావ్య అరూపులు వేయడంతో స్థానికులు అలర్ట్ అయ్యారు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి శ్రావ్యను కాపాడి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. మణికంఠ తలుపులు తీయకపోవడంతో పోలీసులు సహాయంతో విండో గ్లాస్ బ్రేక్ చేసి యువతిని కాపాడారు. అంతలోనే మణికంఠ బాల్కనీ నుండి జంప్ చేసి ఎస్కేప్ అయేందుకు ప్రయత్నించాడు. స్థానికులు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూసేసరికి శ్రావ్య రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతోంది. తీవ్ర గాయాలపాలైన యువతిని చికిత్స నిమిత్తం వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మణికంఠపై ఐపిసి సెక్షన్ 307 ప్రకారం హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఈ దాడి ఘటనకు అనుమానమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. కొన్నాళ్లుగా శ్రావ్య తనతో సరిగా మాట్లాడక పోవడంతో వేరే వాళ్ళతో మాట్లాడుతుంది అంటూ మణికంఠ కోపం పెంచుకున్నాడు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయాడు. ఇందులో భాగంగానే జిమ్‎కు వెళ్లి వస్తున్న క్రమంలో శ్రావ్యను మణికంఠ వెంబడించాడు. శ్రావ్య ఇంట్లోకి వెళ్ళంగానే మణికంఠ గడియ పెట్టి ఆమెపై దాడి చేశాడు. అప్పటికే శ్రావ్య కాల్ మాట్లాడుతుండడంతో మరింత రెచ్చిపోయిన మణికంఠ స్క్రూ డ్రైవర్‎తో ఆమెపై దాడి చేశాడు. శ్రావ్య ఛాతి భాగంతో పాటు మొహంపై తీవ్ర గాయాలయ్యాయి.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..