సింపుల్ సిటికి కేరాఫ్ అడ్రస్ సిద్దిపేట్ అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తాజాగా సిద్దిపేట హౌసింగ్ బోర్డులో రోడ్డు సైడ్ ఉన్న ఓ టిఫిన్ సెంటర్ దగ్గర హరీష్ టిఫిన్ చేశారు. టిఫిన్ బాగుందంటూ కితాబిస్తూనే ఇడ్లీ, దోస లాంగించారు. ఈ సందర్భంగా అక్కడే టిఫిన్ చేస్తున్న యువతతో సరదాగా ముచ్చటించారు హరీష్‌రావు. వారి బాగాగోలు అడిగి తెలుసుకున్నారు. అకస్మాత్తుగా ఇడ్లీ టిఫిన్ బండి దగ్గర హరీష్ రావు ఆగడంతో అశ్చర్య పోయిన టిఫిన్ ప్రియులు.. ఎగబడి మరీ సెల్పీలు దిగారు. సెల్పీలు దిగడానికి వచ్చిన మహిళలు, యువతులను పలకరించారు హరీష్. టిఫిన్ సెంటర్ ఓనర్‌ని గిరాకీ మంచిగా అవుతుందా అని అడిగి తెలుసుకున్నారు హరీష్. సిద్దిపేట గతంలో కన్నా ఇప్పుడు చాలా అభివృద్ధి అయిదంటూ యువత మాజీ మంత్రితో తెలిపారు.