ఆయన విధి నిర్వహణలో మునిగిపోయారు. సహాయక చర్యల్లో అవిశ్రాంతంగా పనిచేశారు. వీలైనంత త్వరగా కారు బయటకు తీయాలని ప్రయత్నించారు. కారును వ్యవసాయ బావి నుంచి తీసేందుకు మెళకువలు చెప్పారు. గజ ఈతగాళ్లకు సలహా ఇచ్చారు. సుమారుగా 9 గంటల పాటు కారు ఆచూకి కోసం ప్రయత్నించాడు. కానీ.. ఆ.. కారులో నుంచి వచ్చిన మృతదేహాం.. తన అన్నదని తెలియడంతో.. షాక్ గురయ్యారు ఫైర్ ఆఫిసర్ బుద్దయ్య నాయక్. వివరాల్లోకి వెళ్తే… కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నముల్కనూరు బావిలో కారు పడిన ఘటనలో రిటైర్డ్ ఎస్‌ఐ పాపయ్య నాయక్ మృతి చెందారు. కారు ఓన్ డ్రైవింగ్ చేస్తూ.. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వెళ్లాడు.. చిన్న ముల్కనూర్ సమీపంలో ప్రమాదవశాత్తూ వ్యవసాయ బావిలో కారు పడిపోయింది. ఈ ప్రమాదం.. గురువారం ఉదయం.. 11 గంటలకు జరిగింది.. అటు నుంచి వెళ్తున్న ప్రయాణీకులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.. పోలీసులు.. గజ ఈతగాళ్లు సహాయంతో ఆపరేషన్ మొదలుపెట్టారు.. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
ఫైర్ సిబ్బంది కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. ట్యూబ్‌లు.. తాళ్లు ఇతర సామాగ్రిని ఫైర్ సిబ్బంది సమకూర్చారు. అయితే.. ఫైర్ ఆఫీసర్ బుద్దయ్య నాయక్… ఈ ఆపరేషన్ లో కీలక పాత్ర పోషించారు.. పలు సూచనలు ఇచ్చారు.. కానీ.. కారులో ఉంది.. తన అన్న అని తెలియదు.. కారు బయటకు తీసిన తర్వాత.. అందులో ఉన్న మృతదేహం తన అన్నది అని తెలియడంతో బోరున విలపించారు. కారు బయటకు తీసేందుకు ఉదయం నుంచి శ్రమించిన ఫైర్ సిబ్బందిలో ఒకరైన బుద్దయ్య నాయక్ సొంత సోదరుడే మృతుడు పాపయ్య నాయక్. మృతదేహం బయటకు తీసేంతవరకు తన సొంత అన్నే కారులో ఉన్నాడన్న విషయం బుద్దయ్య నాయక్‌కు తెలియదు. దీంతో డెడ్‌బాడీని చూడగానే బుద్ధయ్య నాయక్ కుప్పకూలిపోయారు. దీంతో.. తోటి సిబ్బంది ఆయన్ను ఓదార్చారు.
(సంపత్, టీవీ9 తెలుగు, కరీంనగర్)
Also Read: అర్దరాత్రి బుగ్గైన బ్రతుకులు.. రొయ్యల చెరువు వద్ద కరెంట్ షాక్.. ఆరుగురు మృతి..