AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BRS Public Meeting: ఖమ్మం గుమ్మం నుంచి బీఆర్ఎస్ సమర శంఖం.. నేడే ఆవిర్భావ సభ..

అన్ని కార్లూ ఖమ్మం వైపే. ఖమ్మం గుమ్మం నుంచి బీఆర్ఎస్ సమర శంఖం. ఆవిర్భావ సభను విజయవంతం చేయడం ద్వారా.. జాతీయ రాజకీయాల్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలన్నదే ఫస్ట్ టార్గెట్.

BRS Public Meeting: ఖమ్మం గుమ్మం నుంచి బీఆర్ఎస్ సమర శంఖం.. నేడే ఆవిర్భావ సభ..
Brs Meeting
Shiva Prajapati
| Edited By: Ravi Kiran|

Updated on: Jan 18, 2023 | 11:17 AM

Share

అన్ని కార్లూ ఖమ్మం వైపే. ఖమ్మం గుమ్మం నుంచి బీఆర్ఎస్ సమర శంఖం. ఆవిర్భావ సభను విజయవంతం చేయడం ద్వారా.. జాతీయ రాజకీయాల్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలన్నదే ఫస్ట్ టార్గెట్. ఈ మీటింగ్‌లో పార్టీ జెండా, అజెండా ప్రకటించనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇవాళ ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరుగనుంది. ఈ సభకు సీఎంలు కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ రాజా హాజరవుతున్నారు.

ఖమ్మం సభ ద్వారా సత్తా చాటాలని చూస్తోంది బీఆర్ఎస్. సభకు ముగ్గురు సీఎంలు, నేషనల్ పార్టీ లీడర్లను ఆహ్వానించడం ద్వారా జాతీయ స్థాయిలోనూ చర్చ జరిగేలా ప్లానేసింది. ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయ్ తో పాటు.. మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా ఇప్పటికే నగరానికి వచ్చేశారు. ఈ ఉదయం ప్రగతి భవన్‌లో వీరందరితోనూ ప్రత్యేకంగా సమావేశమవుతారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. వీరితో దేశ రాజకీయాలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.

ప్రగతి భవన్‌లో ప్రత్యేక సమావేశం..

ఇక ఖమ్మం సభ ద్వారా.. బీఆర్ఎస్ ఎజెండా, విధివిధానాలపై కేసీఆర్ కీలక ప్రకటన చేసేలా తెలుస్తోంది. ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, జరిగిన అభివృద్ధి గురించి వివరించనున్నారు. అదే సమయంలో.. ప్రస్తుతం దేశ ప్రజలకు ఎలాంటి అవసరాలున్నాయి? వారికోసమంటూ తీసుకురావల్సిన పథకాలేంటన్నది ప్రకటించనున్నారు బీఆర్ఎస్ అధినేత. ఆప్, సీపీఎం, సీపీఐ, ఎస్పీ పార్టీల అధినేతలను ఆహ్వానించడం ద్వారా.. భవిష్యత్ లో వీరి తోనే తమ దోస్తీ ఉండబోతున్నట్టు సంకేతాలనిస్తున్నారు సీఎం కేసీఆర్.

భారీ ఏర్పాట్లు..

ఖమ్మం సభకు భారీ ఏర్పాట్లు చేసింది బీఆర్ఎస్. ఐదు లక్షల మంది జనసమీకరణతో వంద ఎకరాల్లో ఈ సభ నిర్వహిస్తున్నారు. 448 ఎకరాల్లో పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. మొత్తం వెయ్యిమంది వాలంటీర్లను నిమించారు. హైదరాబాద్ నుంచి అతిథులతో పాటు.. రెండు హెలికాఫ్టర్లతో మొదట యాదాద్రికి వెళ్తారు కేసీఆర్. దర్శనం తర్వాత నేరుగా ఖమ్మం చేరుకుని.. కలెక్టరేట్ తో పాటు రెండో విడద కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సభా వేదికపై ముఖ్య అతిథులతో పాటు ఖమ్మం జిల్లా BRS ప్రజా ప్రతినిథులు, ముఖ్య నేతలు మాత్రమే ఉంటారు. మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వేదిక ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రాంగణంలో కూర్చోనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..