Telangana: రాజన్న సిరిసిల్ల సెస్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ హవా.. కొత్తగా ఎంపికైన డైరెక్టర్లు వీరే..

ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) డైరెక్టర్ల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ సత్తా చాటింది. మొత్తం 15 డైరెక్టర్లకు ఎన్నికలు జరిగగా అందరూ బీఆర్‌ఎస్‌ పార్టీ బలపరచిన అభ్యర్థులే కావడం విశేషం. ఈనెల 24వ తేదీన ఈ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే...

Telangana: రాజన్న సిరిసిల్ల సెస్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ హవా.. కొత్తగా ఎంపికైన డైరెక్టర్లు వీరే..
Cess Electiions
Follow us

|

Updated on: Dec 27, 2022 | 7:04 AM

ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) డైరెక్టర్ల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ సత్తా చాటింది. మొత్తం 15 డైరెక్టర్లకు ఎన్నికలు జరిగగా అందరూ బీఆర్‌ఎస్‌ పార్టీ బలపరచిన అభ్యర్థులే కావడం విశేషం. ఈనెల 24వ తేదీన ఈ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 13 మండలాలతో పాటు సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో ఉన్న 87,130 మంది ఓటర్లకు గాను 73,189 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 84 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 15 సీట్లకు గాను 75 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.

ఇదిలా ఉంటే వేములవాడ రూరల్ స్థానంలో రీ కౌంటింగ్‌ నిర్వహించగా బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థి 3 ఓట్లతో గెలుపొందాడు. ఇక చందుర్తిలో రెండు ఓట్ల స్వల్ప మెజారిటీతో బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించాడు. దీంతో బీజేపీ రీ కౌంటింగ్‌కు డిమాండ్ చేసింది. కానీ అధికారులు ఇందుకు తిరస్కించారు. సెస్ కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయాని నేడు సిరిసిల్ల జిల్లాలో నిరసన కార్యక్రమాలకు బీజేపీ పిలుపునిచ్చింది.

కొత్తగా ఎన్నికైన డైరెక్టర్లు వీరే..

సిరిసిల్ల టౌన్- 1కు సెస్ డైరెక్టర్‌గా దిడ్డి రమాదేవి, సిరిసిల్ల టౌన్-2 కు దార్నాం లక్ష్మీ నారాయణ, వేములవాడ టౌన్- 1కు సెస్ డైరెక్టర్‌గా నామాల ఉమ, వేములవాడ టౌన్ -2 కు సెస్ డైరెక్టర్‌గా రేగులపాటి హరిచరణ్ రావు, వేములవాడ రూరల్ సెస్ డైరెక్టర్‌గా ఆకుల దేవరాజం, రుద్రంగి మండలానికి ఆకుల గంగారాం, బోయిన్‌పల్లి మండలానికి కొట్టపల్లి సుధాకర్, వీర్నపల్లి మాడుదుల మల్లేశం, ఎల్లారెడ్డిపేట మండలానికి కృష్ణహరి, తంగళ్లపల్లి మండలానికి చిక్కాల రామరావు, కొనరావుపేట మండలానికి దేవరకొండ తిరుపతి, చందుర్తి మండలానికి శ్రీనివాస రావు, గంభీరావుపేట మండలానికి గౌరినేని నారాయణ రావు, ముస్తాబాద్ మండలానికి సందుపట్ల అంజి రెడ్డి, ఇల్లంతకుంట మండలానికి మళ్లుగారి రవీందర్ రెడ్డి డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు.

ఇవి కూడా చదవండి

రీకౌంటింగ్‌పై కోర్టుకు..

సెస్‌ ఎన్నికల ఫలితాలపై బీజేపీ బలపర్చిన అభ్యర్థి రమేష్‌ కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. చందుర్తి మండలంలో రెండు ఓట్ల తేడాతో ఓడిపోయిన రమేష్‌ రీ కౌంటింగ్‌కు డిమాండ్‌ చేశారు. అయితే దీనికి అధికారులు అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించాలని డిసైడ్‌ అయ్యారు. ఇదిలా ఉంటే 3 ఓట్లతో ఓడిపోయిన వేములవాడ రూరల్ స్థానంపై అభ్యర్థి కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. సెస్‌ ఫలితాలపై బీజేపీ లీగల్‌ టీం పూర్తి వివరాలు సేకరిస్తోంది. ఫలితాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తోన్న బీజేపీ నేడు సిరిసిల్ల వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!