MLA Rajaiah: కడియం ఓ ఆరుద్ర పురుగు.. తేల్చుకుందాంరా.. ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు..

|

Jul 09, 2023 | 7:36 PM

Station Ghanpur Politics: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం.. తెలంగాణలో ఇది ఎప్పుడూ హాట్ టాపికే.. ఎందుకంటే.. ఇక్కడ అధికార పార్టీలో లొల్లి ఎప్పటినుంచో కొనసాగుతోంది.. నియోజకవర్గంలో అవినీతి పెరుగుతుందంటూ..

MLA Rajaiah: కడియం ఓ ఆరుద్ర పురుగు.. తేల్చుకుందాంరా.. ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు..
Kadiyam Srihari Rajaiah
Follow us on

Station Ghanpur Politics: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం.. తెలంగాణలో ఇది ఎప్పుడూ హాట్ టాపికే.. ఎందుకంటే.. ఇక్కడ అధికార పార్టీలో లొల్లి ఎప్పటినుంచో కొనసాగుతోంది.. నియోజకవర్గంలో అవినీతి పెరుగుతుందంటూ.. ఎమ్మెల్యే రాజయ్య టార్గెట్ గా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి తోడు.. ఇటీవల ఓ సర్పంచ్ స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై పలు ఆరోపణలు సైతం చేశారు.. స్టేషన్ ఘన్‌పూర్ BRSలో ముసలం మరింత ముదురుతోంది.. వీటన్నింటి మధ్య.. కడియం శ్రీవారిపై ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం ఓ ఆరుద్ర పురుగు.. అంటూ రాజయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆరుద్రకార్తెలో ఎర్రపురుగులు ప్రత్యక్షం ఆయునట్టు.. ఎన్నికల వేళ నియోజకవర్గంలో కడియం ఫ్లెక్సీలు వెలిశాయ్‌.. అంటూ పేర్కొన్నారు.

రాజయ్య మాట్లాడుతూ.. కడియం శ్రీహరి కులం మీద చర్చ జరగాలి.. శ్రీహరి SC కాదు..ఆయన తల్లి బీసీ.. విద్య, ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లను శ్రీహరి దుర్వినియోగం చేశారు.. అంటూ పేర్కొన్నారు. తప్పుడు ధ్రువపత్రాలతో శ్రీహరి MLA అయ్యారన్నారు. ఏ విషయంలోనైనా నువ్వు గొప్పో, నేను గొప్పో తేల్చుకుందాంరా అంటూ సవాల్ చేశారు. సమయం నువ్వే చెప్పాలంటూ శ్రీహరికి రాజయ్య సవాల్‌ చేశారు. ఓడిపోయాక శ్రీహరి స్టేషన్‌ఘన్‌పూర్‌ను పట్టించుకోలేదు.. శ్రీహరికి అందుకే దళిత దొర అని బిరుదు అంటూ రాజయ్య పేర్కొన్నారు. ఇప్పుడేమో స్టేషన్‌ ఘనపూర్‌ను తానే అభివృద్ధి చేశానని చెప్పుకొంటున్నారంటూ విమర్శించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..