ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి.. కడియం శ్రీహరి తీరుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం..

కాంగ్రెస్‌లోకి వెళ్తున్న కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఆ పార్టీ నేతలు. విలువల గురించి మాట్లాడే కడియం విలువలంటే ఇవేనా? అని ప్రశ్నిస్తున్నారు. కడియంకు కేసీఆర్ ఎన్నో అవకాశాలు ఇస్తే.. పార్టీపై తప్పుడు ప్రచారం సరికాదని అన్నారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి..

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి.. కడియం శ్రీహరి తీరుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం..
Warangal Politics

Updated on: Mar 29, 2024 | 1:19 PM

కాంగ్రెస్‌లోకి వెళ్తున్న కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఆ పార్టీ నేతలు. విలువల గురించి మాట్లాడే కడియం విలువలంటే ఇవేనా? అని ప్రశ్నిస్తున్నారు. కడియంకు కేసీఆర్ ఎన్నో అవకాశాలు ఇస్తే.. పార్టీపై తప్పుడు ప్రచారం సరికాదని అన్నారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.. బీసీలు, దళితులను రాజకీయంగా ఎదగనీయకుండా కడియం శ్రీహరి అడ్డుకున్నారని ఆరోపించారు మరో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. కడియంకు కేసీఆర్ ఇచ్చినన్ని అవకాశాలు మరెవ్వరికి ఇవ్వలేదని పేర్కొన్నారు.

కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో హనుమకొండ జిల్లా బీఆర్‌ఎస్‌ ముఖ్యనేతల సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎర్రబెల్లి దయాకర్ రావు, వినయ్‌భాస్కర్‌, సుదర్శన్‌రెడ్డి హాజరయ్యారు. కడియం రాజీనామా లేఖ ఆశ్చర్యం కలిగించిందని వినయ్ భాస్కర్ తెలిపారు. ఈనెల 31నాటి పార్టీ కార్యక్రమం కోసం మాట్లాడినపుడు కూడా ఈ విషయం చెప్పలేదన్నారు. ఈ విషయంపై దిగ్బ్రాంతి చెందామని తెలిపారు. శ్రీహరి ఏ పార్టీలో ఉన్నా, అణచివేత ధోరణితో ఎంతోమందిని బలిపశువును చేశారు.

వీడియో చూడండి..

ఇదిలాఉంటే.. కడియం పార్టీకి రాజీనామా చేయడంతో BRS జిల్లా పార్టీ ఆఫీస్‌లో కడియం ఫొటోలను BRS కార్యకర్తలు తొలగించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..