Telangana: వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు శుభవార్త.. ఎకరానికి రూ.10వేలు.. డేట్ ఫిక్స్ చేసిన సర్కార్

|

May 04, 2023 | 8:03 PM

తెలంగాణలో అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేలు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. . ఈనెల 12 నుంచి రైతులకు నగదు పంపిణీ చేయనునుంది. గత నెల 23న సీఎం కేసీఆర్ స్వయంగా వరంగల్ జిల్లాలో పర్యటించారు.

Telangana: వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు శుభవార్త.. ఎకరానికి రూ.10వేలు.. డేట్ ఫిక్స్ చేసిన సర్కార్
Farmers
Follow us on

తెలంగాణలో అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేలు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. . ఈనెల 12 నుంచి రైతులకు నగదు పంపిణీ చేయనునుంది. గత నెల 23న సీఎం కేసీఆర్ స్వయంగా వరంగల్ జిల్లాలో పర్యటించారు. అకాల వర్షాలు, వడగళ్ల వానలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులను ఓదార్చారు. ఈ క్రమంలో ఎకరానికి రూ.10వేల చొప్పున పంట పరిహారం అందజేస్తామని ప్రకటించారు. ఈ నెల 12 నుంచి రైతులకు పంట నష్టపరిహారానికి సంబంధించిన చెక్కులను అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

అయితే సీఎం కేసీఆర్ పరిహారం ప్రకటించినా ఇంతవరకు అవి రైతుల చెంతకు రాలేవని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అదే సమయంలో వర్షాలు కూడా ఆగడం లేదు. దీంతో వర్షాల వల్ల నష్టపోయిన బాధిత రైతులందరికీ నగదు పంపిణీ చేస్తామన్నారు. కౌలు రైతులకు కూడా పరిహారం చెల్లిస్తామన్నారు. అలాగే నష్టపోయిన కౌలు రైతుల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఇప్పటికే ప్రభుత్వానికి అందించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి