KCR: ఘనంగా పోరాట యోధుని పుట్టిన రోజు వేడుకలు.. 70వ ప్రాయంలోకి కేసీఆర్..

బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు, తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు బర్త్‌డే నేడు. గులాబీ బాస్‌ 70వ జన్మదిన వేడుకల్లో భాగంగా దేవాలయాలు, మసీదులు, చర్చిలలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తారు పార్టీ కార్యకర్తలు. దివ్యాంగులకు వీల్‌ చెయిర్లు, ఆటో డ్రైవర్లకు ఆరోగ్య, ప్రమాద బీమా పత్రాలు అందించనుంది బీఆర్‌ఎస్‌.

KCR: ఘనంగా పోరాట యోధుని పుట్టిన రోజు వేడుకలు.. 70వ ప్రాయంలోకి కేసీఆర్..
Kcr Birthday

Updated on: Feb 17, 2024 | 11:09 AM

బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు, తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు బర్త్‌డే నేడు. గులాబీ బాస్‌ 70వ జన్మదిన వేడుకల్లో భాగంగా దేవాలయాలు, మసీదులు, చర్చిలలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తారు పార్టీ కార్యకర్తలు. కేసీఆర్ అంటే మూడు అక్షరాలు కాదు. ఆయన ఒక స్వప్నం, ఒక లక్ష్యం, ఒక సంకల్పం, ఒక వ్యూహం, ఒక పోరాటం. చిన్న నాయకుడుగా ప్రారంభమై నేడు దేశరాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు. ఈయన పుట్టిన రోజు సందర్భంగా దివ్యాంగులకు వీల్‌ చెయిర్లు, ఆటో డ్రైవర్లకు ఆరోగ్య, ప్రమాద బీమా పత్రాలు అందించనుంది బీఆర్‌ఎస్‌. తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లి ప్రత్యేక తెలంగాణ సాధించి రెండుసార్లు సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌కు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశను కలిగించాయి. కాంగ్రెస్‌ పార్టీ అధికారం దక్కించుకోవడంతో ఆయన పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది.

ఎన్నికల ఫలితాల తర్వాత ఫామ్‌హౌస్‌లో కాలుజారి పడిపోవడంతో కేసీఆర్‌కు యశోదా ఆసుపత్రిలో తుంటి ఎముక మార్పిడి నిర్వహించారు. ఈ మధ్యే కోలుకున్న కేసీఆర్‌ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు కూడా స్వీకరించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకున్నా ఇటీవల నల్గొండలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్‌సభ ఎన్నికలకు అజెండాను కూడా సిద్ధం చేసిన ఆయన మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకునేందుకు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణకు అసలైన ప్రాతినిధ్యం వహించేది బీఆర్‌ఎస్‌ పార్టీయేనని ఘంటాపథంగా చెప్పారు.

ఈ తరుణంలో ఆయన 70వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ వర్గాలు నిర్ణయించాయి. హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో పార్టీ ప్రముఖుల సమక్షంలో కేసీఆర్‌ బర్త్‌ డే వేడుకలు నిర్వహించనున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు బీఆర్‌ఎస్‌ నేతలు. కేసీఆర్‌ రాజకీయ నేపథ్యంపై రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రదర్శిస్తారు. కేసీఆర్ జన్మదిన వేడుకలను గ్రామాల్లోనూ ఘనంగా నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ శ్రేణులకు పార్టీ అధిష్టానం సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..